Site icon NTV Telugu

Manchu Manoj: చంద్రగిరి జల్లికట్టు వేడుకలో మంచు మనోజ్.. అభిమానుల్లో జోష్..

Manchu Manoj

Manchu Manoj

తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జల్లికట్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ నటుడు, టాలీవుడ్ రాక్‌ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీ, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు మనోజ్‌కు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి గజమాలతో మంచు మనోజ్‌ను ఆహ్వానించారు. హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరవడంతో.. యూత్ అంతా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని, గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. మనోజ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.

READ MORE: CM Chandrababu: రేపు తిరుపతికి సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోకి హాజరు

ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. ‘‘బ్రిటీష్ కాలం నుంచి ‘జల్లికట్టు’ పండుగ జరుగుతూనే ఉంది. సంస్కృతి, సాంప్రదాయాలకు గుర్తుగా చేసుకునే ఈ జల్లికట్టు వేడుకలను గత 20 సంవత్సరాలుగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించడం చాలా గొప్ప విషయం. తమిళనాడు ‘జల్లికట్టు’తో పోల్చుకుంటే ఇక్కడ అంత సివియర్‌గా ఉండదు. ఇక్కడ అంతా సాప్ట్‌గా ఉంటుంది. పశువుల పండగ‌గా చాలా భక్తితో జరుపుకుంటాం. పశువులపై హింసాత్మకంగా ప్రవర్తించకుండా, ముందుగా ఆలోచించుకుని ఇక్కడ ఈ వేడుకను జరుపుతుంటారు. దీనిని ప్రజలంతా ఎంతో ఆనందకరంగా పార్టీలకు, కులాలకు అతీతంగా జరుపుకుంటారు. పోలీస్ వారు లా అండ్ అర్డర్ విషయంలో చాలా కేరింగ్‌గా ఉన్నారు. దీనిలో పాల్గొనే ఉత్సాహవంతులైన యువకులంతా పోలీసు వారికి సహకరిస్తూ, శాంతి భద్రతలను కాపాడుతూ జల్లికట్టులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను.’’ అని అన్నారు.

READ MORE: Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవర్ స్టార్‌ సీన్ లీక్.. గూస్ బంప్స్ పక్కా!

Exit mobile version