Site icon NTV Telugu

Man turns Cooler on: ఆయన కూలర్ ఆన్ చేశాడు.. ఆమెకు కాలింది.. కట్ చేస్తే..

Woman Looses Temper

Woman Looses Temper

Man turns Cooler on: ఎయిర్‌ కూలర్ ఆన్‌ చేయడం వల్ల ఓ వ్యక్తి చెప్పు దెబ్బలు తినాల్సి వచ్చింది. నిజమేనండోయ్.. గత సోమవారం చత్తీస్‌గఢ్‌లోని ఓ ఆస్పత్రిలో దారుణమైన ఘటన జరిగింది. అంబికాపూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లోని వెయిటింగ్ హాల్‌లో ఓ వ్యక్తి పడుకున్నాడు. ఆ హాల్‌లోనే చాలా మంది నిద్రిస్తున్నారు. ఓ మహిళ లేచి ఎయిర్‌ కూలర్‌ ఆఫ్ చేసింది. దానికి ఆ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ మళ్లీ ఆన్ చేశాడు. అదే ఆయన పాలిట శాపమైంది. ఎందుకు ఆన్ చేశావంటూ ఆ వ్యక్తిని చెప్పుతో కొట్టడం పాటు కాలితో తన్నింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Kriti Kharbanda: థైస్ అందాలతో కాక రేపుతున్న పవన్ హీరోయిన్

ఆ వీడియోలో ఆ వ్యక్తి నేలపై కూర్చున్నట్లు కనిపించింది. ఒక మహిళ అకస్మాత్తుగా అతని వద్దకు వచ్చి చెప్పుతో కొట్టడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా కాలితో తన్నింది. ఆమె పక్కన నిలబడి ఉన్న మరొక వ్యక్తి కూడా అతడిని కర్రతో కొట్టాడు. ఆ వ్యక్తి రాత్రిపూట ఆసుపత్రి వెయిటింగ్ హాల్‌లో ఎయిర్ కూలర్ ఆన్‌లో నిద్రిస్తున్నప్పుడు, మహిళ వచ్చి స్విచ్ ఆఫ్ చేసింది. కూలర్‌ను ఎందుకు ఆఫ్ చేశారని అతడు ఆమెను ప్రశ్నించగా, ఆ మహిళ చలించిపోయి వ్యక్తిపై దాడి చేసింది. బాధితుడి నుంచి ఎటువంటి ప్రతిఘటన లేకపోయినప్పటికీ మహిళ ఆ వ్యక్తిపై దెబ్బల వర్షం కురిపించింది. పరిస్థితి విషమించకముందే సెక్యూరిటీ గార్డులు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. సరైన కారణం లేకుండా ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడని, కేవలం పడుకోవడానికి స్థలం కోసం చూస్తున్నాడని ఆసుపత్రి యాజమాన్యం తర్వాత నిర్ధారించింది. ఆసుపత్రి తన ప్రాంగణంలోకి ఇలాంటి అనధికార ప్రవేశాలపై నిఘా ఉంచుతుందని పేర్కొంది.

Exit mobile version