Site icon NTV Telugu

Viral Video: వీడసలు మనిషేనా.. కుక్క మెడకు తాడు కట్టి నేలకేసి కొట్టి కొట్టి చంపాడు దుర్మార్గుడు

Dog

Dog

Man Killed Dog on Road, Viral Video: సమాజంలో జరుగుతున్న హింస చూస్తుంటే రోజు రోజుకు సమాజం ఎంత దిగజారిపోతుందో అర్థం అవుతుంది. చిన్నారులు, మహిళలు, మసలి వాళ్లు అని ఏమాత్రం జాలి లేకుండా ఇష్టం వచ్చినట్లు హింసిస్తున్నారు. హత్యలు, అత్యాచారాలు చేస్తూ తెగబడుతున్నారు. చట్టాలు మా చుట్టాలు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇక ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఖచ్ఛితంగా ఎవరికైనా పాపం అనిపిస్తుంది. ఇక జంతు ప్రేమికులు అయితే దీన్ని చూస్తే అస్సలు తట్టుకోలేరు. ప్రియ సింగ్ అనే ఎక్స్(ట్విటర్) యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు.

Also Read: Horse Viral Video: మొదటిసారి అద్దంలో చూసుకున్న గుర్రం.. ఏం చేసిందంటే?

ఈ వీడియోలో ఓ వ్యక్తి కుక్క మెడకు తాడు కట్టి రోడ్డు మీదకు తీసుకువస్తాడు. ఇలా చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి కూడా అతనికి సహకరిస్తాడు. అనంతరం కుక్కను నడిరోడ్డు మీదకు తీసుకువచ్చి నేల కేసి గట్టిగా కొడతాడు. ఆ కుక్క నొప్పితో విలవిలలాడుతూ అరుస్తున్న ఆ దుర్మార్గుడి మనసు కరగలేదు. అలాగే దాన్ని కొడుతూనే ఉన్నాడు. పక్కనే ఉన్న మరో కుక్క కూడా దానిని కొట్టొద్దు అన్నట్టు అరుస్తుంది. కానీ పాపం ఏం చేయలేక చూస్తుండి పోతుంది. ఆ వ్యక్తి మాతం కనికరం లేకుండా ఆ కుక్కను చనిపోయే వరకు కసిగా నెలకేసి కొడుతూనే ఉన్నాడు. చుట్టు పక్కల వారు దానిని చూస్తూ ప్రేక్షకులలాగా ఉండిపోవడం చూస్తుంటే నిజంగా సమాజంలో మానవత్వం చచ్చిపోయిందేమో అనిపిస్తోంది. గుమిగూడి చూస్తున్నారే తప్ప అతనిని అడ్డుకునేందుకు ఎవ్వరు ప్రయత్నించలేదు. ఈ ఘాతుకానికి సంబంధించిన విజువల్స్ అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రియ సింగ్ అనే యూజర్ తన ఎక్స్( ట్విటర్) ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేస్తూ “యూపీలోని ఔరాలో ఇది జరిగింది. ఓ వ్యక్తి కుక్క మెడకు తాడు కట్టి నెలకేసి కొట్టి చంపాడు. ఈ వీడియో చూస్తుంటే మానవత్వం చచ్చిపోయినట్లు కనిపిస్తుంది” అంటూ క్యాప్షన్ జోడించి పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

Exit mobile version