NTV Telugu Site icon

Viral: సాయం చిన్నదైన ఆదర్శం గొప్పది.. ఆచరించాలంటే మనసుండాలి

Water

Water

Viral: మనిషికి మనిషి సాయం చేసుకోవడం మానవత్వం. నేటి సమాజంలో అది కరువైంది. డబ్బు సంపాదన మోజులో పడి మానవత్వాన్ని మరిచి క్రూరంగా తయారవుతున్నాడు. ఈ క్రమంలో సాటి మనిషినే గుర్తించలేని వారు ఇక జంతుపక్షులను ఏం గుర్తిస్తారు. ఆపదలో ఉన్న వారికే సాయం చేసే తీరిక లేని జనం.. పశుపక్షాదులను ఏం పట్టించుకుంటారు. అలాంటి అప్పుడే కొన్ని ఘటనలు చూసినప్పుడు మానవత్వం ఇంకా బతికే ఉందనిపిస్తోంది. మనుషులే కాదు జంతువులు, పక్షులకు కూడా దాహం వేస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు జంతువులు, పక్షులు నీటి కోసం అల్లాడుతుంటాయి. కానీ వాటికి సరిపడా నీటి వసతులు లేవు. అలాంటి సమయాల్లో సాయం చేసిన వారు వాటి పాలిట దేవుళ్లవుతారు. సాయం చిన్నదైనా.. అది గొప్ప కార్యాలను చేపట్టేందుకు ఆదర్శంగా నిలుస్తుందనిపిస్తుంది. ఈ సందర్భంలోనే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్రజల హృదయాలను గెలుచుకుంది.

Read Also: Delhi Court: మోదీని చంపుతాడని సాక్ష్యం ఉందా.. లేదు కదా.. అందుకే నిర్దోషి

నిజానికి ఈ వీడియోలో దాహంతో బాధపడుతున్న పిచ్చుకను చూడవచ్చు. కొంత సేపటికి నీళ్లు రాకపోతే చచ్చిపోతుందేమో అనిపించింది. అయితే, ఒక సైక్లిస్ట్ అటుగా వెళుతుండగా, పిచ్చుక బాధను చూసి, సీసాలోంచి నీళ్ళు తీసి పక్షికి ఇచ్చాడు. ఆ పక్షి రోడ్డుపై కూర్చుని దాహం వేస్తోందని, ఓ వ్యక్తి బాటిల్ మూతలోంచి నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న తీరును వీడియోలో చూడవచ్చు. అతను పైనుండి పక్షి నోటిలోకి కొంచెం నీరు పోశాడు. అప్పుడు పక్షికి కొంత ఉపశమనం లభిస్తుంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 30 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 58,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అలాగే మూడు వేల మంది లైక్ చేశారు.