Site icon NTV Telugu

MSG : ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి నెక్స్ట్ సాంగ్ రెడీ.. శశిరేఖ డ్యూయెట్ పై క్లారిటీ!

Manashankara Vara[rasad

Manashankara Vara[rasad

మెగాస్టార్ చిరంజీవి – నయనతార జంటగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంపై భారీ అంచనాలు వేళ్లూనుకున్నాయి. అనిల్ రావిపూడి మాస్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ కలిపిన స్టైల్‌కు చిరంజీవి కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్‌లో పాజిటివ్ వైబ్స్ మొదటి నుంచే నెలకొన్నాయి. ఇటీవలి కాలంలో విడుదలైన మొదటి సాంగ్ ‘మీసాల పిల్ల’ యూట్యూబ్, సోషల్ మీడియాలో దూసుకుపోతూ సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోందని, స్క్రీన్‌పై చిరు – నయనతార కెమిస్ట్రీ మరోసారి హైలైట్ అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఇప్పుడు సినిమా యూనిట్ రెండో సాంగ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, ఈసారి ఒక రొమాంటిక్ డ్యూయెట్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొదట ఈ సాంగ్‌ను వెంకీ మామ – చిరంజీవి కాంబోలో చేశారనే రూమర్స్ వినిపించినప్పటికీ, అసలు విషయం ఏమిటంటే ఈ డ్యూయెట్ చిరంజీవి – నయనతార జంటపై చిత్రీకరించబడిందట. ఈ పాటకు ‘శశిరేఖ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ చెలామణి అవుతోంది. భీమ్స్ సిసిరోలియో దీనికి మెలోడియస్ ట్యూన్ అందించాడని, సాంగ్ ఎలా ఉండబోతుందనే ఆసక్తితో ఫ్యాన్స్ ఇప్పటికే ఎదురుచూస్తున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కొత్త సాంగ్ ఎంత మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Exit mobile version