NTV Telugu Site icon

Poliece Car Stolen: పోలీసుల కారునే దొంగలించాడు.. క్లైమాక్స్ మాత్రం సూపర్ బాసు

Car

Car

ఓ దొంగ ఏకంగా పోలీసు పెట్రోలింగ్ కారునే దొంగిలించాడు. ధూమ్‌ సినిమాలా జెట్ స్పీట్‌తో వెళ్లిపోయాడు. చివరికి మృత్యువు చివరి అంచువరకు వెళ్లి బతికిపోయాడు. ఈ దొంగను కాపాడింది పోలీసులే కావడం గమనార్హం. ఈ అనుహ్య ఘటన యూఎస్‌లోని అట్లాంటాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. యూఎస్‌లోని అట్లాంటాలో ఓ వ్యక్తి పోలీస్‌ పెట్రోలింగ్‌ కారును దొంగలించి సాహసం చేశాడు. దీంతో ఒక్కసారిగా అలర్ట్‌ అయిన పోలీసులు అతడ్ని వెంబడించారు. అంతేకాదు ఒక పక్క కారుని ట్రాక్ చేస్తూనే ఫాలో చేయడం ప్రారంభించారు. మరోవైపు ఆకాశం నుంచి హెలికాఫ్టర్‌ల సాయంతో కూడా ఛేజ్‌ చేశారు. ఇంతలో అనుహ్యంగా ఆ కారు అదుపుతప్పి సమీపంలో ఉన్న రైల్వే పట్టాలపై పల్టీలు కొట్టి తలకిందులగా పడిపోయింది.

కాగా, అదే సమయంలో అనుహ్యంగా ఒక రైలు స్పీడ్‌గా వస్తోంది. అంతే నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చి ఆ నిందితుడిని బయటకు లాగి రక్షించిన కొద్ది నిమిషాల్లోనే రైలు ఆ కారుని గుద్దుకుంటూ వెళ్లిపోయింది. నిందితుడు మాత్రం కొద్దిపాటి గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు ఆ దొంగను రక్షించడమే గాక అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

Amigos: ఆహా.. రొమాన్స్ లో బాబాయ్ ను మించిపోయిన అబ్బాయ్

Show comments