Site icon NTV Telugu

Mamata Benerjee: మమతా బెనర్జీ ఇంటి దగ్గర ఉగ్రవాది రెక్కీ..మర్డర్ ప్లాన్ చేశారా!

Mamata Benerjee

Mamata Benerjee

మూడంచెల భద్రతను తప్పించుకుని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నివాసంలోకి ఓ ఉగ్రవాది ప్రవేశించడం కలకలం సృష్టించింది. సీఎం మమత ఇంటి వద్ద ఆ ఉగ్రవాది ఏడుసార్లు రెక్కి నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తు తేలింది. మమతా బెనర్జీని ఆ ఉగ్రవాది టార్గెట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కోల్‌కతాలోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న మమత ఇంటి దగ్గరం హఫీజుల్ మొల్లా రెక్కీ నిర్వహించాడు.ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ కదలికలపై ఆ ఉగ్రవాది ఫోకస్ పెట్టాడు. ఈ విషయాన్ని గమనించిన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. తన చరవాణిలో మమత నివాసాన్ని, ఆమె ఫొటోలు తీశారని పోలీసులు తెలిపారు.

Dwarf Couple: అర్థరాత్రి వీళ్లు చేసిన సాహసానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

ఈ నెల 2, 3 తేదీల మధ్య రాత్రి రెక్కి నిర్వహించిన ఉగ్రవాది హఫీజుల్.. సీఎం మమతా బెనర్జీ భద్రతా సిబ్బందిని దాటి ఇంట్లోకి ఇనుపరాడ్డుతో ప్రవేశించాడని పోలీసులు గుర్తించారు. అతని దగ్గర 11 సిమ్ కార్డులు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు హఫీజుల్ బంగ్లాదేశ్, ఝార్ఖండ్, బిహార్‌కు చెందిన పలువురికి ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే నిందితుడు గ‌త ఏడాది స‌రైన ప‌త్రాలు లేకుండానే బంగ్లాదేశ్‌కు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు.ఈ ఘటన అనంతరం పోలీసు అధికారుల పోస్టింగుల్లో కోల్‌కతా అధికార యంత్రాంగం పలు మార్పులు చేసింది.సీఎం ఇంటి వద్దే ఉగ్రవాది ఇలా సంచరించడంతో ముఖ్యమంత్రి సెక్యూరిటీ డైరెక్టర్‌ను పదవి నుంచి తొలగించారు. మరోవైపు ఉగ్రవాది కార్యకలాపాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version