Site icon NTV Telugu

Viral : ఎక్కడా ప్లేస్ లేనట్టు గదిలో బైక్ డ్రైవింగ్ ఏంట్రా.. పగిలిపోయిందిగా

Stunt

Stunt

Viral : సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కువగా చాలామంది స్టంట్ వీడియోలను ఇష్టపడుతుంటారు. ఇంటర్నెట్‌లో ఆ వీడియోలు అప్ లోడ్ అయిన క్షణాల్లో వైరల్‌గా మారుతాయి. చాలా మంది దృష్టిని ఆ వీడియోలు ఆకర్షిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ రోజుల్లో యువతలో బైక్ క్రేజ్ ఏ మేరకు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద బైకులంటే వారిలో చాలా క్రేజ్ ఉంటుంది. అలాంటి బైకులతో స్టంట్స్ చేసి ఫేమస్ కావాలని చూస్తున్నారు యూత్.

Read Also:First List Of BRS: ఆట మొదలైంది.. రేపు 105 మందితో తొలి జాబితా విడుదల..!

స్టంటింగ్ అంటే చిన్నపిల్లల ఆట కాదు, చాలా ప్రాక్టీస్ కావాలి. అలాంటి స్టంట్ ఎక్కడైనా చేయవచ్చు. కానీ అక్కడ చేసేటప్పుడు కాస్తంత చుట్టుపక్కల చూసుకోవాలి. లేదంటే పెద్ద నష్టం జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోను చూడండి. గదిలో ఓ యువకుడు బైక్‌తో విన్యాసాలు చేయడం చూపిస్తోంది. ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి తన బైక్ ముందు చక్రాన్ని ఎత్తడం ద్వారా గదిలో స్టంట్ చేయడం ప్రారంభించాడు. అతను ముందుకు వెళ్ళిన వెంటనే, టీవీని బైక్ ముందు భాగం ఢీకొని అది పడిపోయి విరిగిపోతుంది. ఇప్పుడు ఈ స్టంట్‌ని చూపించి ఫేమస్ అవ్వాలనుకున్నా.. ఈ స్టంట్‌కి ఇంత ఖర్చవుతుందని అతనికి తెలియదు.

Read Also:Pet Cat Died: పెంచుకున్న పిల్లి చనిపోతే.. అమ్మాయి ఏడ్చిన తీరు కన్నీళ్లు పెట్టిస్తోంది

ఈ వీడియో diogo_grau062 అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేయబడింది. దీన్ని రెండు లక్షల మందికి పైగా లైక్ చేయగా, కోట్లాది మంది చూశారు. దీనితో పాటు ప్రజలు దీనిపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. ఇంట్లో ఈ రకమైన స్టంట్ చేయాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version