Site icon NTV Telugu

Vijayawada Crime: గే డేటింగ్ యాప్.. యువకుడి ప్రాణం తీసింది..

Vijayawada Crime

Vijayawada Crime

Vijayawada Crime: రకరకాల డేటింగ్‌ యాప్‌లు వచ్చాయి.. అబ్బాయి, అమ్మాయిలు పరిచయం చేసుకుని.. చాటింగ్‌.. డేటింగ్‌.. కొన్ని చీటింగ్‌తో ఎండ్‌ అవుతున్నాయి.. మరికొన్ని యాప్‌లు ప్రాణాల మీదకు తెస్తున్నాయి.. ఇప్పుడు గే డేటింగ్‌ యాప్‌ వ్యవహారం విజయవాడలో కలకలం రేపుతోంది.. గే డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన ఇద్దరు యువకులు ఏకాంతంగా కలిశారు.. వారి మధ్య ఏం జరిగిందో తెలియదు.. కానీ, ప్రసాద్‌ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం నిర్వహించగా.. ఆ రిపోర్టులో తీవ్రంగా కొట్టడం వల్లే ప్రసాద్ చనిపోయాడని తేలింది.. దీంతో.. లోతుగా విచారణ జరపగా అసలు విషయం వెలుగు చూసింది.

Read Also: Weather: తీరం దాటనున్న బిపర్ జోయ్ తుఫాన్.. ఐఎండి హెచ్చరికలు

బెజవాడలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెజవాడకు చెందిన ప్రసాద్, అవనిగడ్డకు చెందిన సాయికి గ్రిండర్ యాప్ లో పరిచయం ఏర్పడింది.. ఇక గత నెల 18న విజయవాడలో సాయి, ప్రసాద్ కలుసుకున్నారు.. మద్యం తాగి కృష్ణా నదిలోకి ఏకాంతంగా గడపటానికి వెళ్లారు.. మద్యం మత్తులో ఉన్న ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది.. దీంతో.. ప్రసాద్ పై కర్రతో తీవ్రంగా దాడి చేశాడు సాయి.. కొద్దిసేపటి తర్వాత ఇంటికి ఆటోలో బయల్దేరి వెళ్లిన ప్రసాద్ మృతిచెందాడు.. అయితే, తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టు మార్టం రిపోర్టులో తీవ్రంగా కొట్టడం వల్ల ప్రసాద్ చనిపోయాడని గుర్తించారు.. విచారణలో గే యాప్, సాయి దాడి చేసి హత్య చేశాడని నిర్ధారణకు వచ్చారు.. సాయిని అదుపులోకి తీసుకుని.. మతదైన శైలిలో విచారణ జరపడంలో.. వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది.

Exit mobile version