Site icon NTV Telugu

Illicit Relationship: ప్రియుడితో వెళ్లిపోయిన ముగ్గురు పిల్లల తల్లి.. భార్య మీద కోపంతో పిల్లల్ని హత్య చేసిన తండ్రి

Tamilnadu

Tamilnadu

సోషల్ మీడియా కుటుంబాలను, జీవితాలను చిన్నాభిన్నం చేస్తో్ంది. సోషల్ మీడియాలో పరిచయాలు ప్రేమగా మారి ఏకంగా భర్త పిల్లలను కూడా వదిలేసి ప్రియుడితో పరారవుతున్నారు పలువురు మహిళలు. తాజాగా తమిళనాడులో ఘోరం చోటుచేసుకుంది. ఓ మహిళ ముగ్గురు పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. విషయం తెలిసిన భర్త పిల్లలకోసమైన తిరిగి రావాలని ప్రాధేయపడ్డాడు. కానీ ఆమె తిరిగి రాలేదు. దీంతో మానసిక వేదనకు గురై క్షణికావేశంలో ముగ్గురు పిల్లలను చంపేశాడు తండ్రి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Also Read:Off The Record : ఆ జిల్లాలో ఉన్నదే ముగ్గురు ఎమ్మెల్యేలు, రెండు వర్గాలయ్యారా..?

భార్య ప్రియుడితో వెళ్లిపోయిందనే ఆగ్రహంతో అల్లారు ముద్దుగా పెంచిన ముగ్గురు పిల్లలను ఓ తండ్రి హతమార్చిన దారుణమైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.. తమిళ నాడు రాష్ట్రం తంజావూరు జిల్లా గోపాల సముద్రం ప్రాంతంలో వినోద్ కుమార్, నిత్య అనే దంపతులు నివసి స్తున్నారు. వీరికి ఓవియా (12), కీర్తి (8) అనే కుమా ర్తెలు, ఈశ్వరన్ (5) అనే కుమారుడు ఉన్నారు. ఇటీవల నిత్యకు సామాజిక మాధ్యమాల ద్వారా తిరువారూర్ జిల్లా మన్నార్ గుడికి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్ప డింది.

Also Read:Vasudevasutam Teaser : ఈ కథ శ్రీ కృష్ణుడిదే కాదు..ఓ యువకుడిది!

పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఆరునెలల ముందు నిత్య భర్త, పిల్లలను విడిచిపెట్టి ఆ యువకుడితో వెళ్లిపోయింది. అయితే నిత్యను వినోద్ కుమార్ కలుసుకుని పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ప్రియుడిని విడిచిపెట్టి రమ్మని కోరాడు. కానీ ఆమె తన పట్టును సడలించలేదు. దీంతో భార్యపై ఉన్న ఆగ్రహాన్ని తన ముగ్గురు పిల్లలపై చూపించాడు. శుక్ర వారం సాయంత్రం తన ఇంట్లో ఓ గదిలో పిల్లలు ముగ్గురిని బంధించి స్వీట్లు తినాలని చెప్పాడు పిల్లలు స్వీట్లు తింటుండగానే కత్తితో దాడి జరిపి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Exit mobile version