నెదర్లాండ్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. రన్నింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌లోకి ప్రవేశించిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. షిపోల్ దగ్గర ఈ సంఘటన జరిగింది. రన్నింగ్ సమయంలో ఒక వ్యక్తి నడుస్తున్న విమానం ఇంజిన్‌లోకి వెళ్లి చిక్కుకుని మరణించినట్లు డచ్ ఫ్లాగ్‌షిప్ క్యారియర్ KLM ఒక ప్రకటనలో తెలిపింది. బాధితుడి వివరాలు మాత్రం వెల్లడించలేదు.
ఇది కూడా చదవండి: Tirumala: రేపు తిరుమలకు కేంద్ర మంత్రి అమిత్ షా రాక
ప్రమాదం జరిగిన తర్వాత విమానం నుంచి ప్రయాణికులను దించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ విమానం మధ్యాహ్నం 2.25 గంటలకు డెన్మార్క్‌లోని బిలుండ్‌కి విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సి ఉంది. ఇక మరణించిన వ్యక్తి ఉద్యోగి లేదా ప్రయాణికుడా? అన్నది ఇంకా తెలియలేదు. ఇక మరణించిన వ్యక్తికి సంస్థ సంతాపం తెలిపింది.
ఇది కూడా చదవండి: Ravindra Jadeja: ఐసిసి టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 క్యాప్‌ని జడేజాకు అందించిన టీమిండియా కోచ్..