NTV Telugu Site icon

Cobra Fight : తుపాకీ కాల్పులకు ఎదురుతిరిగిన పాము

Snake

Snake

Cobra Fight : సాధారణంగా చిన్న శబ్ధం అయితేనే పాములు భయపడి పారిపోతాయి. అలాంటిది ఒక వ్యక్తి తన వద్ద ఉన్న గన్‌తో పాముపైకి కాల్పులు జరిపాడు. దీంతో కోపంతో ఆ పాము ఎదురు తిరిగింది. ఇంకే ముంది పాము ధైర్యానికి తుపాకీ తన చేతిలో ఉన్నప్పటికీ ఆ వ్యక్తే తోక ముడవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఒక వ్యక్తి కారులో వెళ్తున్నాడు. కచ్చా రోడ్డుపై ఒక నాగుపాము కనిపించింది. దీంతో అతడు తన వాహనాన్ని ఆపాడు. ఆ పామును కవ్వించేందుకు.. తన వద్ద ఉన్న రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. గురి తప్పడంతో మరో బుల్లెట్‌ను దగ్గర నుంచి ఫైర్‌ చేశాడు. దీంతో ఆగ్రహించిన ఆ నాగుపాము జరజర ముందుకు పాకుతూ కాటు వేసేందుకు వేగంగా ఆ వ్యక్తి వైపు దూసుకొచ్చింది. కాగా, ఇన్‌స్టెంట్‌ కర్మ అన్న యూజర్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘నాగుపాముతో పోరాటానికి గన్‌ తీసుకురావద్దు’ అని శీర్షిక పెట్టారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. సుమారు రెండు లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు.