Site icon NTV Telugu

AAP: హనుమంతుడి చేతిలో ఇన్సులిన్‌ పెట్టి శోభాయాత్ర.. ఆప్‌ తీరుపై నెటిజన్లు ఫైర్

Hanuman With Insulin

Hanuman With Insulin

Aam Admi Party: హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. హనుమంతుడి చేతిలో ఇన్సులిన్ పెట్టి శోభాయాత్ర చేయడం పట్ల నెటిజన్లు, హిందుత్వ వాదులు ఫైర్ అవుతున్నారు. ఆమ్ పార్టీ లీడర్, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పాల్గొన్న ఈ ర్యాలీలో హనుమంతుడి వేషాధారణలో ఉన్న వ్యక్తి రెండు చేతుల్లో ఇన్సులిన్ బాటిళ్లు పట్టుకున్నాడు.

Read Also: PM Modi: రిజర్వేషన్లు రద్దు, మతం ఆధారంగా విభజించడం జరగదు..

కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సోమవారం తిహార్ జైలులో ఇన్సులిన్ డోస్ ఇచ్చిన విషయం తెలిసిందే. జైలులో ఉన్న ఆయనకు షుగల్ లెవల్స్ 320కి పెరగడంతో ఆయనకు ఇన్సులిన్ ఇచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇస్తే హనుమంతుడి చేతిలో ఇన్సులిన్ పెట్టి శోభాయాత్ర చేయడం ఏంటని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

 

Exit mobile version