Site icon NTV Telugu

Andhra Pradesh: ఎస్సై ఫిజికల్‌ టెస్ట్‌లో అపశృతి.. రన్నింగ్‌లో పాల్గొన్న యువకుడు మృతి

Guntur

Guntur

Andhra Pradesh: ఎస్సై ఉద్యోంగం సంపాదించి లైఫ్‌లో సెటిల్‌ కావాలనుకున్న ఓ యువకుడి ఆశలు అడియాశలయ్యాయి.. ఎస్సై సెలక్షలోనే ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు.. ఈ ఘటన అంకిరెడ్డిపాలంలో విషాదాన్ని నింపింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఎస్సై సెలక్షన్స్‌కు హాజరయ్యాడు అంకిరెడ్డిపాలెంకు చెందిన మోహన్‌.. అయితే, ఎస్సై సెలక్షన్స్‌లో భాగంగా నిర్వహించిన 1600 మీటర్ల రన్నింగ్‌లో పాల్గొన్న మోహన్‌ కుమారు.. సొమ్మసిల్లి కుప్పకూలిపోయాడు.. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.. హుటాహుటినా.. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది.. ఎందుకంటే అప్పటికే మోహన్‌కుమార్‌ మృతిచెందినట్టు గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు తెలిపారు. మోహన్‌కుమార్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. అప్పటికే మృతిచెందినట్టు తేల్చారు డాక్టర్లు.. దీంతో.. మోహన్‌ కుమార్‌ స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.. ఈ ఘటనతో అంకిరెడ్డిపాలెంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Read Also: Libya Flood: లిబియాలో వరద బీభత్సం.. చెల్లాచెదురుగా మృతదేహాలు

Exit mobile version