Talakona Falls: ప్రకృతి అందాలకు నిలయమైన తలకోన వాటర్ ఫాల్స్ లో ఓ యువకుడు వీడియో స్టిల్ కోసం నీటిమడుగులో డైవ్ వేసి అందులోనే మునిగి మృతి చెందాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన 23 ఏళ్ల సుమంత్.. చెన్నైలో రాజీవ్ గాంధీ కళాశాలలో ఎంఎస్సీ చదువుతున్నాడు. తిరుపతికి చెందిన సహ విద్యార్థితో కలిసి తలకోన పర్యటనకు వెళ్లాడు.. తలకోన వాటర్ ఫాల్స్ కి వెళ్లి స్నేహితులందరూ సరదాగా జలకాలాటాడారు.
Read Also: Sara Ali Khan : తనపై వస్తున్న ట్రోలింగ్స్ గురించి ఘాటుగా స్పందించిన సారా అలీ ఖాన్
అయితే, ఈ క్రమంలో సుమంత్ తాను ఎత్తు నుంచి నీటిమడుగులోకి తలకిందులుగా దూకే విన్యాసం డైవ్ వేస్తుండగా వీడియో తీయమని మిత్రులను కోరారు.. వారు మొబైల్ కెమెరాల్లో వీడియో తీస్తుండగా స్టిల్ కోసం పైనుంచి నీటి మడుగులోకి తలకిందులుగా దూకాడు.. అయితే, నీటి అడుగుభాగాన కొక్కెర రాళ్లు, బండరాల మధ్యలో చిక్కుకొని నీటి అడుగులోనే ఆగిపోయాడు.. ఎంతసేపు చూసినా అతను నీటి పైకి రాకపోవడంతో షాక్ తిన్న స్నేహితులు గంట సేపు అక్కడే అతని ఎదురుచూశారు.. ఎంతకీపైకి రాకపోవడంతో.. అంతా వెతికారు.. పైనుండి చూస్తే.. ఆ స్వచ్ఛమైన నీటి అడుగు భాగంలో సుమంత్ ఇరుక్కుపోయినట్టు గుర్తించారు.. అప్పటికే సంధ్య వేళచీకటి పడటంతో అక్కడున్న వారికి చెప్పి.. తిరిగి వెళ్లిపోయారు.. ఆ విషయాన్ని ఎలావారిపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని వెలికితీశారు.. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు ముగ్గురు తలకోన నీటిలో మునిగి మృతి చెందారు.. వాటర్ ఫాల్స్ వద్ద అటవీ శాఖ అధికారులు పర్యాటలకు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
Read Also: Grandhi Srinivas: పవన్ కల్యాణ్ సస్పెన్స్ క్రియేట్ చేశారు.. తుస్సుమనిపించారు..