Site icon NTV Telugu

Man Cuts Himself: అమ్మవారి దర్శనానికి వచ్చి బ్లేడుతో గొంతు కోసుకున్నాడు..

Man Cuts Himself

Man Cuts Himself

Man Cuts Himself: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లోని శీత్లా మాత ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన 27 ఏళ్ల వ్యక్తి శనివారం బ్లేడుతో గొంతు కోసుకుని గాయాలపాలై మరణించాడు. మృతుడు మనోజ్ కుమార్ తన తల్లితో కలిసి మీర్జాపూర్‌లో హాలియా ప్రాంతంలోని ప్రసిద్ధ ఘట్గా ధామ్‌లోని శీత్లా మాత ఆలయానికి వెళ్లాడు. అతని తల్లి కేశరీ దేవి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మనోజ్‌ కుమార్ ఆలయ ద్వారం వద్ద కూర్చుని, తన జేబులో నుంచి బ్లేడును తీసి అతని శరీరమంతా అనేక గాయాలు చేసుకున్నాడు. అతనికి విపరీతంగా రక్తస్రావం కావడంతో కొంత సమయం తర్వాత స్పృహ కోల్పోయాడు.

Money rain on Highway: హైవేపై డబ్బుల వర్షం, ఎగబడిన జనం.. వీడియో వైరల్

గమనించిన తల్లి అతని వద్దకు పరుగెత్తింది. సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించింది. పరిస్థితి విషమించడంతో మీర్జాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆలయంలో అమర్చిన సీసీటీవీ కెమెరాను పోలీసులు పరిశీలించగా.. మనోజ్‌ కుమార్ ఆలయ ద్వారం ముందు కూర్చుని బ్లేడ్‌తో తనపై గాయాలు చేసుకున్నట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనోజ్‌ కుమార్ లాల్‌గంజ్‌లోని ఇందిరా గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇం గత కొన్ని రోజులుగా మానసిక స్థితి సరిగా లేదని తెలిసిందని పోలీసులు వెల్లడించారు.

Exit mobile version