NTV Telugu Site icon

Sachin Tendulkar: రాత్రిళ్లు పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి.. సచిన్ పొరుగింటి వ్యక్తి ఫిర్యాదు!

Sachin Anjali

Sachin Anjali

Sachin Tendulkar neighbour complains of loud noise: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నివాసం నుంచి రాత్రిళ్లు పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయని పొరుగింటి వ్యక్తి ఒకరు ఫిర్యాదు చేశారు. సచిన్ ఇంటి వెలుపల ఉన్న సిమెంట్ మిక్సర్.. పగటి పూట మాత్రమే కాదు రాత్రి కూడా తనని డిస్ట్రబ్ చేస్తుందని పేర్కొన్నాడు. సరైన సమయంలో వర్క్ చేసుకోమని మీ ఇంటిలో పని చేసే వ్యక్తులకు చెప్పండి అని సచిన్‌ను అతడు అభ్యర్దించాడు. ఈ మేరకు దిలీప్ డిసౌజా అనే వ్యక్తి తన ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.

దిలీప్ డిసౌజా తన ఎక్స్‌లో ఆదివారం ఒక పోస్ట్‌ చేశాడు. ‘ప్రియమైన సచిన్ టెండూల్కర్. ఇప్పుడు దాదాపు రాత్రి 9 గంటలైంది. అయినా మీ బాంద్రా ఇంటి వెలుపల నుంచి పెద్ద శబ్దం వస్తూనే ఉంది. మీ ఇంటి వెలుపల ఉన్న సిమెంట్ మిక్సర్ ఇప్పటికీ పెద్ద పెద్ద శబ్దం చేస్తూనే ఉంది. దయచేసి మీ ఇంటిలో పని చేసే వ్యక్తులను సరైన పని వేళలను పాటించమని చెప్పండి?. చాలా ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. దాదాపు 5,00,000 వ్యూస్ మరియు 500 కంటే ఎక్కువ రీట్వీట్‌లు వచ్చాయి.

Also Read: MI vs SRH: కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్‌ 174!

దిలీప్ డిసౌజాను చాలా మంది నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నావా? అని కొందరు మండిపడుతున్నారు. సచిన్ టెండూల్కర్‌ను ట్యాగ్ చేయడానికి బదులుగా ముంబై పోలీసులను ట్యాగ్ చేసి ఉండాల్సిందని మరికొందరు అంటున్నారు. రాత్రి 10 గంటల వరకు నిర్మాణ పనులు అనుమతించబడతాయని, ఆ తర్వాత నీకు డిస్ట్రబ్ అయితే కంప్లైంట్ ఇవ్వాలంటున్నారు. మీరు ఇల్లు కట్టుకోలేదా?, ఇందంతా పబ్లిసిటీ కోసమే అని ఫైర్ అవుతున్నారు.