పాములను చూస్తే చిచ్చు పోసుకునే వాళ్లు చాలామందే ఉన్నారు. మరికొందరేమో వాటిని పట్టుకుని సరదాగా ఆటలు ఆడేవాళ్లు కూడా ఉన్నారు. ఎందుకైన మంచిది పాములకు దూరంగా ఉంటేనే మంచిది. పాముకాటు వల్ల చాలా మంది మరణించినట్లు మనం వింటూనే ఉంటాం. ముఖ్యంగా నాగుపాములలో ఎక్కువ విషం ఉంటుంది. అలాంటప్పుడు వాటికి జనాలు భయపడి దూరంగా ఉంటారు. ఐతే ఈ వీడియాలో ఓ వ్యక్తి భయంలేకుండా నాగుపామును పట్టుకున్నాడు. అది చూస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Yuvraj Singh: ఏంటి రోహిత్ వరల్డ్ కప్ కోసం రన్స్ దాచి పెట్టుకుంటున్నావా..?
ఆ వ్యక్తి ధైర్యానికి అందరూ అభినందించాల్సిందే. నాగుపామును పట్టుకోవడంలో అస్సలు భయపడడు. ఏదో బొమ్మ పామును పట్టుకున్నట్లు పట్టుకున్నాడు. ఆ వీడియోలో చూస్తే.. ఓ వ్యక్తి పామును పట్టుకోవడానికి చుట్టుపక్కల ఉన్న ఇటుకలను తొలగిస్తుండగా, నాగుపాము పడగ విప్పి కాటేయడానికి ప్రయత్నిస్తుంది. అతను భయపడకుండా.. పాము పట్టే కర్ర సహాయంతో నాగుపామును పట్టుకున్నాడు. అయితే ఆ సమయంలో నాగుపాము కోపంగా ఉన్నట్లు మనం చూడొచ్చు. పాము అతన్ని కాటు వేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయినా ఆ వ్యక్తి అప్రమత్తంగా ఉండి.. పామును పట్టుకుంటాడు.
Kishan Reddy : డబుల్ బెడ్ రూం ఇళ్ళపై ఉద్యమం చేపడతాం
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పాము_నవీన్ అనే ఐడితో ఈ వీడియోను షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 2 లక్షల కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. 17 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. అంతేకాకుండా రకరకాల కామెంట్‌లు చేస్తున్నారు.
