Site icon NTV Telugu

CSMIA: ముంబై ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. వ్యక్తి అరెస్ట్

Csmia

Csmia

ఆర్థిక రాజధాని ముంబైలోని ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ముంబై ఎయిర్‌పోర్ట్‌ను పేల్చివేస్తామంటూ అగంతకులు ఫోన్‌ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ముంబై విమానాశ్రయాన్ని పేల్చివేస్తాము అని హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు మూడు గంటల పాటు ఎయిర్‌పోర్ట్‌ను తనిఖీ చేశారు. బాంబు గుర్తింపు బృందాలు, ఇతర భద్రతా సంస్థలు విమానాశ్రయంలో హై అలర్ట్‌లో ఉన్నాయి. MIDC పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి వేగంగా చర్యలు తీసుకున్నారు.

Also Read:Indian Students: క్లాసులకు రాకుంటే వీసా రద్దు.. భారత విద్యార్థులకు అమెరికా హెచ్చరిక..

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పేల్చివేస్తామని బాంబు బెదిరింపు కాల్ చేసిన 35 ఏళ్ల వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబై పోలీసు కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్ వచ్చిన కొద్దిసేపటికే MIDC పోలీసులు ఆ అరెస్టు చేశారు. నిందితుడిని మంజీత్ కుమార్ గౌతమ్ గా గుర్తించారు. అతను ఉత్తరప్రదేశ్ కు చెందినవాడు కాగా ప్రస్తుతం ముంబైలోని సకినాకా ప్రాంతంలో నివసిస్తున్నాడు. గౌతమ్ ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. ఈ కాల్ వెనుక ఉన్న కుట్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version