Bhadradri Kothagudem: ద్విచక్ర వాహనం అంటే.. ఒకరిద్దరు వెళ్లవచ్చు. చిన్న పిల్లలుంటే ఒకరిద్దరు బైక్‌పై ప్రయాణించవచ్చు. అది కూడా సైజు చిన్నగా ఉంటే ప్రయాణం సాగిపోతుంది. కొంతమంది అలా కాదు ట్రిపుల్ రైడింగ్ చేస్తారు. అయితే ముగ్గరు బైక్ పై ఉంటేనే ట్రాఫిక్ పోలీసులు కఠినంగా జరిమానా విధిస్తారు. అయితే కొందరు కుటుంబీకులు ముగ్గురు, నలుగురు పిల్లలను బైక్‌లపై ఎక్కించుకుని సాహస యాత్రలకు వెళుతున్నారు. అలాంటి వ్యక్తి.. ఏడుగురు పిల్లలను స్కూటీపై ఎక్కించుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఈ దృశ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటుచేసుకుంది.
అయితే ఓ యువకుడు తనకు స్కూటీ నడపటం బాగా వచ్చనుకున్నాడో లేకా.. పిల్లల ముందు హీరోయిజం చూపిద్దామనుకున్నాడో కానీ.. ఏడుగురు పిల్లలను బండి ఎక్కించుకుని రోడ్డు మీదికి వచ్చాడు. అంతే జనం కళ్లాంతా ఆ బైక్ మీదే పడ్డాయి.. అసలే ముగ్గురు లేదా నలుగురు వెళ్తుంటేనే విచిత్రంగా చూసే జనం.. ఇలా ఏకంగా ఎనిమిది మంది అందులోనూ ఏడుగురూ చిన్నారులే ఉండటంతో అందరి చూపు ఆ స్కూటివైపే మళ్లింది. ఒకరే ఇద్దరు అయితే ఏమైనా అనుకోవచ్చుగానీ.. ఒకేసారి అంతమందితో బైక్ నడుపుతుంటే స్థానికులందరూ బిత్తరపోయి చూసారు. ఆ ప్రబుద్ధుని విజ్ఞాన ప్రదర్శనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో.. ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఏడుగురు పిల్లలను బండిపై ఎక్కించుకుని వెళుతుండగా అనుకోని ప్రమాదం జరిగితే ఏం జరుగుతుందని ఆ యువకుడిపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే మరికొందరిలో మార్పు వస్తుందని నెటిజన్లు అంటున్నారు. నమస్కారం సార్.. అది స్కూటీ కావాలా.. లేక సెవెన్ సీటర్ ఆటో కావాలా.. అవన్నీ ఎక్కించుకున్నావా అంటూ కమెంట్లు చేశారు. సెవెన్ సీటర్ ఆటోలో కూడా ఏడుగురు మాత్రమే కూర్చుంటారనీ, అయితే ఈ బుద్దిమంతుడు ఏడుగురు పిల్లలతో పాటు మొత్తం 8 మందితో స్కూటీపై ప్రమాదకరంగా ప్రయాణించాడని నెటిజన్లు మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పోలీసులకు చేరింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆ ఎనిమిది మంది బైక్ ప్రయాణించిన దానిపై ఆరా తీసారు. ఆ బైక్ నడిపిన ప్రబుద్ధుడి పేరు కుమ్మరికుంట్ల నాగేశ్వరరావు అని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో అతడిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అందుకే ఓవర్ చేయాలి కానీ.. మితిమీరితే ఇదిగో ఇలానే ఉంటుంది.
Petrol Pump: 5వ అంతస్థులో పెట్రోల్ బంక్.. ఎలా వెళ్లాలి బాసూ