Site icon NTV Telugu

Mamatha Banerjee: మమతను ఆ ప్రశ్న అడిగిన శ్రీలంక ప్రధాని.. దీదీ రిప్లై ఇదే

Mamatha

Mamatha

Mamatha Banerjee Met Sri Lankan President  Ranil Wickremesinghe:  పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. మంగళవారం రోజు మమత విదేశీ ప్రయాణం మొదలయ్యింది. ఈ క్రమంలో బుధవారం దుబాయిలో శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమ సింఘేను కలిశారు దీదీ. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం లాంజ్‌లో మమతను చూసి శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ సింఘే మర్యాద పూర్వకంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆమెను అన్యూహ్య ప్రశ్న అడిగారు రణిల్ విక్రమ సింఘే.

Also Read: Bombay Dyeing Land Deal: ముంబై చరిత్రలోనే అతిపెద్ద ల్యాండ్ డీల్.. బాంబే డైయింగ్ 22 ఎకరాల భూమి రూ.5200 కోట్లు
విపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A.)కు మీరు సారథ్యం వహించనున్నారా? అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు మమత నవ్వుతూ సమాధానం ఇస్తూ ప్రజల సహకారం ఉంటే అధికారంలోకి రావచ్చు. అది ప్రజలపై ఆధారపడి ఉంటుంది అని సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీలంక అధ్యక్షుడితో కలిసి దిగిన ఫోటోను మమత పంచుకున్నారు. ఇక విదేశీ పర్యటనలో ఉన్న మమత 12 రోజుల పాటు దుబాయి, స్పెయిన్‌లలో పర్యటించనున్నారు. విక్రమ్ సింఘేను కలిసిన విషయాన్ని మమత ఎక్స్(ట్విటర్) వేదికగా పంచుకున్నారు. ఇక నవంబర్ 21-22 తేదీల్లో కోల్‌కతాలో జరగనున్న  గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌ సమావేశాలకు కోల్ కత్తా రావాలని విక్రమ్ సింఘేను మమత బెనర్జీ ఆహ్వానించారు. అదేవిధంగా విక్రమ్ సింఘే కూడా మమతను శ్రీలంకకు రావాలని కోరారు. అందుకోసం మమత ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఇక రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికేందుకు స్పెయిన్‌లో జరిగే బిజినెస్ సమ్మిట్స్‌కు మమత హాజరుకానున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా అయినా గద్దె దించాలని భావించి విపక్ష కూటమి ఇండియాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే దానికి ఎవరు సారథ్యం వహిస్తారు అనే విషయం తెలియదు. ఒకవేళ విపక్షకూటమి గెలిస్తే ఎవరు ప్రధాని అవుతారు అనే  విషయంపై ఇంకా క్లారిటీ లేదు. నిన్ననే ప్రతిపక్షకూటమి సమన్వయ కమిటీ తొలిసారి సమావేశం నిర్వహించింది.

 

 

 

Exit mobile version