Mamata Banerjee: ‘మాజీ’ అని పెట్టుకోను.. మమతా బెనర్జీ ‘X’ బయోలో తెలివైన మార్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. అనూహ్య ఓటమితో తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోగా, బీజేపీ తొలిసారి అక్కడ పాగా వేసింది. అయితే, ఈ ఓటమిని జీర్ణించుకోలేక మమతా బెనర్జీ ప్రదర్శించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బెంగాల్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ, మమతా బెనర్జీ ఓటమిని అంగీకరించేందుకు ససేమిరా అన్నారు. కనీసం గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించేందుకు ఆమె నిరాకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 11 గంటల వరకు ఆమె తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) ప్రొఫైల్‌లో “గౌరవనీయ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి” అని ఉండింది. కాగా.. సువేందు అధికారి బీజేపీ తరఫున బెంగాల్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో మమత నిశ్శబ్దంగా తన ‘X’ బయోలో మార్పులు చేశారు. అయితే ఇక్కడే ఆమె తనదైన శైలిలో తెలివితేటలు ప్రదర్శించారు. ఎక్కడా “మాజీ” (Former) అనే పదాన్ని వాడకుండా జాగ్రత్త పడ్డారు. దానికి బదులుగా “పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (15, 16, 17వ విధానసభ)” అని మార్చుకున్నారు. అలాగే 1997లో కాంగ్రెస్ నుంచి విడిపోయి తాను స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా తనను తాను పేర్కొన్నారు.
మమతా బెనర్జీ తన ప్రొఫైల్‌ను అప్డేట్ చేయడంలో జాప్యం చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు ఏకంగా ఎలోన్ మస్క్, ‘ఎక్స్’ యాజమాన్యాన్ని ట్యాగ్ చేస్తూ ఆమె బయోను మార్చాలని, అవసరమైతే అకౌంట్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. “మాజీ అని పెట్టుకోవడానికి ఇష్టం లేక, తన పదవీకాలాన్ని తెలివిగా బయోలో చేర్చుకున్నారు” అని ఒక జర్నలిస్ట్ ట్వీట్ చేయడం ఆమె వైఖరిని స్పష్టం చేస్తోంది. ఏదేమైనా, ఈ మార్పు ద్వారా మమతా పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్లయింది. నిజానికి.. మే 7వ తేదీన అసెంబ్లీ గడువు ముగియడంతో గవర్నర్ ఆర్.ఎన్. రవి సభను రద్దు చేశారు. దీనితో మమత ముఖ్యమంత్రి పదవి ఆటోమేటిక్‌గా రద్దయింది. ఆమె మాజీ అని పెట్టుకోకపోయినా.. ఆ పదాన్ని వాడటానికి ఇష్టం లేకపోయినా ఇక మాజీ సీఎంగానే ఉంటారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?