Site icon NTV Telugu

Kolkata: ఎన్నికల వేళ కోల్‌కతాలో ఈడీ దాడులు.. సీఎం మమత హల్‌చల్

Mamata Banerjee

Mamata Banerjee

అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గురువారం అనూహ్యంగా కోల్‌కతాలో ఈడీ దాడులకు దిగింది. ఐపీఏసీ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. ఈడీ దాడుల వార్తలు కలకలం రేపడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్నారు. దీంతో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ప్రతీక్ జైన్ నివాసంపై ఈడీ దాడులు నిర్విస్తున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి తరుణంలో నేరుగా మమతా బెనర్జీ రంగంలోకి దిగడంతో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఫైటింగ్‌గా మారింది. ప్రస్తుతం కోల్‌కతాలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇది కూడా చదవండి: IMD Warning: ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. చలిగాలులు.. ఐఎండీ వార్నింగ్

త్వరలోనే పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఓ వైపు ఎన్నికల సంఘం ఓటర్ ప్రత్యేక సర్వే నిర్వహిస్తోంది. ఇంకోవైపు కేంద్ర సంస్థలు రైడ్స్ చేస్తున్నాయి. ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఎన్నికల ముందు ఈడీ దాడులు రాజకీయ అలజడి సృష్టిస్తున్నాయి. ఈ రాద్ధాంతం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

ప్రతీక్ జైన్

ప్రతీక్ జైన్.. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సహ-వ్యవస్థాపకుడు అండ్ డైరెక్టర్. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి పొలిటికల్ అడ్వైజర్‌గా పని చేస్తున్నారు.

Exit mobile version