Congress Manifesto: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకుంటుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రస్తుతం ప్రధాన పార్టీలు మేనిఫెస్టో ప్రకటనలపై నజర్ పెట్టాయి. ఇందులో భాగంగా నేడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేయనుంది. ఇవాళ రాష్ట్రానికి రానున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్ లో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఈ మేనిఫెస్టోలోని అంశాలను వివరించనున్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుద్యోగులకు భరోసా కల్పించేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని హస్తం నేతలు అంటున్నారు.
Read Also: Koti Deepotsavam 2023 Day 4: వైభవంగా కోటిదీపోత్సవం.. ఇలకైలాసంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో అంశాలు ఇవే..!
సిటిజన్ చార్ట్ కి చట్టబద్దత
ధరణీ స్థానంలో భూ భారతి పోర్టల్
పసుపు కుంకుమ పథకం కింద ఒక లక్షతో పాటు తులం బంగారం
తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి సన్న బియ్యం పంపిణీ
అమ్మ హస్తం పథకం పేరుతో 9 నిత్యావసర సరుకుల పంపిణీ
ఆర్ఎంపీలకు గుర్తింపు కార్డు
రేషన్ డీలర్లకు గౌరవ వేతనం
వార్డు సభ్యులు గౌరవ వేతనం
ఎంబీసీ లకు ప్రత్యేక కార్పొరేషన్
ట్రాన్స్ జెండర్లకు ఆటోలు ,ప్రత్యేక సంక్షేమ పథకాలు
జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకం