Site icon NTV Telugu

రూమర్లకు మాళవిక మోహనన్ చెక్: ‘ది రాజా సాబ్’ స్టంట్స్ నావే!

Malavika Mohan

Malavika Mohan

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ‘ది రాజా సాబ్’. ప్రభాస్ గత చిత్రాలైన ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి సీరియస్ యాక్షన్ సినిమాల తర్వాత, ఆయన నుంచి వచ్చిన ఒక కంప్లీట్ హారర్ – ఫాంటసీ కామెడీ చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా చాలా స్టైలిష్‌గా, వింటేజ్ లుక్‌లో కనిపించాడు. డార్లింగ్ కి జోడిగా ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. అయితే రీసెంట్‌గా ఈ మూవీలోని ఒక యాక్షన్ ఎపిసోడ్‌లో మాళవిక తన స్టంట్స్ తాను చేయలేదని, ఆమెకు బదులుగా ఒక స్టంట్ డబుల్ (బాడీ డూప్) చేశారనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యింది. ముఖ్యంగా షూటింగ్ సెట్స్‌లో ఒక వ్యక్తి మాళవిక తరహా డ్రెస్ వేసుకుని ఉన్న ఫోటో వైరల్ కావడంతో, నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించారు. దీంతో తాజాగా ఈ రూమర్స్ పై మాళవిక వెంటనే స్పందించారు.

సెట్స్‌లో తాను స్వయంగా రోప్ సాయంతో కష్టమైన ఫైట్స్ చేస్తున్న బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియోలను ప్రూఫ్స్‌గా షేర్ చేశారు. “నేను నా స్టంట్స్ నేనే చేశాను. సినిమాల్లో రిస్కీ షాట్స్ చేసేటప్పుడు లేదా రిహార్సల్స్ కోసం ప్రొఫెషనల్ స్టంట్ డబుల్స్ ఉండటం సర్వసాధారణం. కానీ సినిమాలో మీరు చూసిన ఆ యాక్షన్ సీక్వెన్స్‌లో నేను స్వయంగా పాల్గొన్నాను.. నిజానికి అమ్మాయిలకు సినిమాల్లో యాక్షన్ సీన్స్ చేసే అవకాశం రావడం అరుదు. అందుకే ఇష్టమైన స్టంట్స్ చేయడానికి చాలా కష్టపడ్డా’ అని వీడియో ఆధారాలతో ఆమె ఇచ్చిన ఈ సమాధానంతో ట్రోలర్స్ నోళ్లు మూతపడ్డాయి.

 

Exit mobile version