హీరోయిన్లను వస్తున్నారంటే చాలా మంది చూడటానికి ఎగబడతారు.. వారితో సెల్ఫీలు దిగాలని, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కొందరు అభిమానులు అనుకుంటే మరికొంతమంది మాత్రం వారితో అసహభ్యంగా ప్రవర్తిస్తారు.. తాజాగా ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహన్ కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన మలయాళీ బ్యూటీ మాళవిక మోహనన్. తమిళంలో రజనీకాంత్ ‘పేట’ మూవీలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. దళపతి విజయ్ ‘మాస్టర్’లో, ధనుష్ ‘మారన్’లో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె నటించిన లేటెస్ట్ మూవీ ‘తంగలాన్’ త్వరలో రిలీజ్ కానుంది.. ఇక ప్రభాస్ నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది..
ఇదిలా ఉండగా.. ఈ అమ్మడుకు చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది…ఈమె జైపూర్ నుంచి ఇండిగో విమానంలో చైన్నెకి బుధవారం తిరిగొచ్చానని అయితే.. సోదాల పేరుతో విమాన సిబ్బంది తనతో చాలా అనుచితంగా ప్రవర్తించారని మాళవిక ఆవేదన వ్యక్తం చేసింది. వారి చర్యలు చాలా మొరటుగా ఉన్నాయని రాసుకొచ్చింది.. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు..
Very rude and bad service @IndiGo6E Jaipur. Bad staff behaviour
— Malavika Mohanan (@MalavikaM_) January 3, 2024