బాలివుడ్ ముదురు భామ మలైక అరోరా, అర్జున్ కపూర్ రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే..గత రెండేళ్ల క్రితమే ఈ విషయాన్ని మీడియా ముందు రివిల్ చేశారు..ఇక అప్పటి నుంచి ఘాటు రొమాన్స్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు..అయితే తాజాగా మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..
అర్జున్ కపూర్, మలైకా త్వరలో బిడ్డను కనబోతున్నారని గాసిప్ న్యూస్ స్ప్రెడ్ చేయడంపై గతేడాది ఒక పబ్లికేషన్‌తో పాటు జర్నలిస్టుకు నోటీసులు పంపించాడు అర్జున్. అలాగే తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ‘ఫేక్ న్యూస్’ వార్తలను ఖండించాడు. ఇదిలా ఉంటే, ఇలాంటి వార్తలు రాస్తున్న కొన్ని మీడియా, వెబ్‌సైట్లపై తాజా ఇంటర్వ్యూలో మరోసారి స్పందించాడు..ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేస్తున్న మీడియా ఛానెల్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..
కొన్ని మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేసి, చివరికి అవే నిజమనుకునేలా చేస్తున్ డేంజరస్ రిపోర్టింగ్ గురించి హైలైట్ చేశాడు. తమ వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే ధైర్యం చేయొద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.ప్రేక్షకులను చేరుకునేందుకు జర్నలిస్టులపై ఆధారపడతామన్న అర్జున్.. తామూ మనుషులమనే విషయాన్ని వాళ్లు గుర్తుంచుకోవాలని కోరాడు.. ఒకసారి విషయాన్ని కనుక్కొని రాస్తే బెటర్, ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఊరుకొనేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. వీరిద్దరూ ప్రస్తుతం లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.. పెళ్లి చేసుకుంటారో లేదో చూడాలి..