Site icon NTV Telugu

MLA Vakiti Srihari: మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం.. ఇన్నోవా వాహనాన్ని ఢీకొన్న ఐ20 కార్

Mla Vakiti Srihari

Mla Vakiti Srihari

మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహ‌రికి ఘోర ప్రమాదం తృటిలో త‌ప్పింది. షాద్ నగర్ లో మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వైపు వెళ్తున్న TG 38 6669 నెంబర్ గల ఇన్నోవా కారును పక్కన నుంచి వస్తున్న ఐ 20 కారు వేగంగా ఢీకొట్టింది. షాద్ నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version