NTV Telugu Site icon

Doda Bus Accident: జమ్ము కశ్మీర్లో కాలువలో పడిన బస్సు.. 30 మంది మృతి

New Project (13)

New Project (13)

Doda Bus Accident: జమ్మూకశ్మీర్‌లోని దోడాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్త్వార్ నుంచి జమ్మూ వెళ్తున్న బస్సు అస్సార్ ప్రాంతంలో కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 15 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులందరినీ కిష్త్వార్, దోడాలోని ఆసుపత్రుల్లో చేర్పించారు. తీవ్రంగా గాయపడిన వారి కోసం త్వరలో హెలికాప్టర్ సేవలను ప్రారంభించనున్నారు. అయితే ప్రమాద తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ప్రమాదం తర్వాత రెస్క్యూ ఆపరేషన్ వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో బస్సు కాలువలో పడిపోయింది. చాలా ఎత్తు నుంచి పడిపోవడంతో బస్సు నుజ్జునుజ్జు అయింది. స్థానిక యంత్రాంగం సహకారంతో ప్రజలు సహాయక చర్యలు చేపడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశం గుండా రోడ్డు వెళ్లడం, మలుపు వద్ద లోతైన గుంత ఉండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి మలుపు తీసుకుంటుండగా బస్సు అదుపు తప్పి ఈ ఘోర ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రమాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. అస‌ర్‌లో జ‌రిగిన బ‌స్సు ప్రమాదం త‌న‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంద‌ని అన్నారు. క్షతగాత్రులు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

Show comments