MAI offer Rs 99 tickets On Cinema Lovers Day 2024: సినీ ప్రియులకు శుభవార్త. రూ. 250కి పైగా టికెట్ ఉండే మల్టీప్లెక్స్‌లో కేవలం రూ.99కే సినిమా చూసే అవకాశం మీ ముందుంది. మే 31న ‘సినిమా లవర్స్ డే’ సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ హైదరాబాద్‌లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్ సినిమాస్, సిటీ ప్రైడ్, ఏసియన్, మూవీ టైం.. లాంటి అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.99కే సినిమా చూసే అవకాశాన్ని ప్రేక్షకులకు అసోసియేషన్ కల్పిస్తోంది.
Also Read: Bigg Boss 8 Telugu: కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్.. ఈసారి హౌస్‌లోకి హీరో, హీరోయిన్స్!
మే 31వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో ఏ భాష సినిమా అయినా, ఏ షో అయినా ప్రేక్షకులు రూ. 99కే చూడొచ్చని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. పేటీఎం, అమెజాన్ పే, బుక్‌మై షో వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే వారు రూ.99తో పాటు జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. థియేటర్ కౌంటర్ వద్ద కొనుగోలు చేస్తే మాత్రం ఎలాంటి చార్జీలూ వర్తించవు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రాలు మే 31వ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆలస్యం ఎందుకు ఇగ.. ఇప్పుడే టిక్కెట్లు బుక్ చేసుకుని ఈ సమ్మర్‌లో మీ ఫ్యామిలీతో ఎంచక్కా ఎంజాయ్ చేయండి.
