Site icon NTV Telugu

Mahindra XUV 3XO Diesel: రూ. లక్ష డౌన్ పేమెంట్ తో కారు కొనేయండి.. ఈఎంఐ ఎంతంటే?

Mahindra

Mahindra

కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రాకు చెందిన బడ్జెట్ SUV మహీంద్రా XUV 3XO బేస్ వేరియంట్ పై ఓ లుక్కేయండి. రూ. లక్ష డౌన్ పేమెంట్ చేసి కారును ఇంటికి తెచ్చుకోవచ్చు. మిగతా సొమ్మును ఈఎంఐ రూపంలో చెల్లించొచ్చు. ప్రతి నెల ఎంత ఈఎంఐ చెల్లించాలంటే? మహీంద్రా XUV 3XO డీజిల్ బేస్ వేరియంట్‌గా MX3ని అందిస్తుంది. ఈ కారు బేస్ వేరియంట్ (మహీంద్రా XUV 3XO డీజిల్ MX3 ధర) ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.90 లక్షలు.

Also Read:CM Revanth Reddy: కేంద్రం చర్యలకు మద్దతుగా నిలబడాలి.. తీవ్రవాదాన్ని అంతమొందించాలి

ఈ వాహనాన్ని ఢిల్లీలో కొనుగోలు చేస్తే, RTO కి దాదాపు 79 వేల రూపాయలు, బీమా కి దాదాపు 48 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మహీంద్రా XUV 3XO డీజిల్ MX3 ఆన్ రోడ్ ధర దాదాపు రూ.11.17 లక్షలు అవుతుంది. ఈ కారు యొక్క డీజిల్ బేస్ వేరియంట్ MX3ని కొనుగోలు చేస్తే, బ్యాంక్ దానిని ఎక్స్-షోరూమ్ ధరకు మాత్రమే ఫైనాన్స్ చేస్తుంది. అప్పుడు రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చేసిన తర్వాత, మీరు బ్యాంకు నుంచి దాదాపు రూ. 10.17 లక్షలు ఫైనాన్స్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకు మీకు 9 శాతం వడ్డీకి ఏడు సంవత్సరాల పాటు రూ. 10.17 లక్షలు ఇస్తే, రాబోయే ఏడు సంవత్సరాల పాటు మీరు ప్రతి నెలా రూ. 16,367 ఈఎంఐ చెల్లించాలి.

Also Read:Indus water: “సింధు నది” నీరు పాకిస్తాన్‌కి దక్కకుండా భారత్ వ్యూహం..

కారు ధర ఎంత అవుతుంది?

బ్యాంకు నుంచి 9 శాతం వడ్డీ రేటుతో ఏడు సంవత్సరాల పాటు రూ. 10.17 లక్షల కారు రుణం తీసుకుంటే, మీరు ఏడు సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 16,367 ఈఎంఐ చెల్లించాలి. ఏడు సంవత్సరాలలో మీరు మహీంద్రా XUV 3XO MX3 డీజిల్ కోసం దాదాపు రూ. 3.57 లక్షల వడ్డీని చెల్లిస్తారు. ఆ తర్వాత మీ కారు మొత్తం ధర ఎక్స్-షోరూమ్, ఆన్ రోడ్, వడ్డీతో సహా దాదాపు రూ. 14.74 లక్షలు అవుతుంది.

Exit mobile version