NTV Telugu Site icon

Mahindra XUV 3XO EV : మార్కెట్ దున్నేసేందుకు రెడీ అవుతున్న మహీంద్రా XUV 3XO ఎలక్ట్రిక్ వేరియంట్.. పూర్తి వివరాలు ఇవే

Mahindra Xuv 3xo

Mahindra Xuv 3xo

Mahindra XUV 3XO EV : మహీంద్రా గత సంవత్సరం తన ప్రముఖ కాంపాక్ట్ SUV XUV 300 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా XUV 3XO ను విడుదల చేసింది. XUV 3XO విడుదలైనప్పటి నుండి కస్టమర్లను తెగ ఆకట్టుకుంటుంది. ప్రతి నెలా సగటున 9,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. ఈ డిమాండ్‌ను చూసి కంపెనీ ఇప్పుడు XUV 3XO ఎలక్ట్రిక్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మహీంద్రా XUV 3XO EV టెస్టింగ్ సమయంలో రోడ్డు మీద చాలా సార్లు కనిపించింది.

డిజైన్ ఇలా ఉందంటే..
డిజైన్ గురించి మాట్లాడుకుంటే.. రాబోయే ఎలక్ట్రిక్ SUV లో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, C-టైపు LED డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉంటాయని భావిస్తున్నారు. ఈ EV కుడి ఫ్రంట్ ఫెండర్ పైన ఛార్జింగ్ పోర్ట్ తో వస్తుంది. దీనితో పాటు ఈ EV లో అప్ డేటెడ్ ఫ్రంట్ గ్రిల్, కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్ కూడా ఉన్నాయి. మరోవైపు, వెనుక భాగంలో, EV కనెక్ట్ చేయబడిన LED టెయిల్ లాంప్‌లతో రాబోతుంది.

Read Also:Manchu Family: మెజిస్ట్రేట్ ముందే తిట్టుకున్న మంచు మనోజ్ & మోహన్ బాబు!

అద్భుతమైన ఫీచర్లతో రానున్న కారు
మరోవైపు, ఫీచర్ల పరంగా చూస్తే EV 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. ఈవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 10 లక్షలు ఉంటుందని అంచనా. మార్కెట్లో ఈ ఈవీ.. టాటా పంచ్ EV, సిట్రోయెన్ eC3, MG విండ్సర్ EV, ఎంట్రీ-లెవల్ నెక్సాన్ EV వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

400 కి.మీ.ల రేంజ్
పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడుకుంటే.. మహీంద్రా XUV 3XO EV కి 34.5 kWh బ్యాటరీ ప్యాక్ ఇవ్వవచ్చు. ఈ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 375-400 కి.మీ డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగలదు. ఈ EV ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Read Also:Sonu Sood: సోనూసూద్ ట్రస్ట్ తరపున ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్ లు