ప్రపంచాన్ని తన సినిమాతో మెప్పించిన డైరెక్టర్ రాజమౌళి తో సినిమాలు చెయ్యాలని ప్రతి హీరో అనుకోవడం కామన్.. ఎందుకంటే ఆయన సినిమాలు అలా ఉంటాయి మరి.. రాజమౌళి ని మించిన దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో కూడా రాజమౌళి ని కొట్టే దర్శకుడు మరొకరు కనిపించడం లేదు.. సినిమా పై తనకున్న ఇష్టమే తనను ఈ స్థాయిలో ఉంచిందని ఎన్నో సార్లు ఆయన నోటి వెంట వచ్చింది..
త్రిపుల్ ఆర్ తో ఆస్కార్ అందుకున్న జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు..మహేష్ బాబుతో ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమాతో ఆయన ఎంత మేరకు ప్రేక్షకులను అలరిస్తాడు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఎలాంటి క్యారెక్టర్ పోషిస్తున్నాడు అనే వార్తలు గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి..
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహేష్ ఈ సినిమాలో ఒక హిప్పీ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. హిప్పీ అంటే దేశ దిమ్మర్లు, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వలస వెళ్తూ ఉండేవారు. ఇలా తను తిరుగుతున్న ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో జనాలు ఎదురుకుంటున్న కొన్ని సమస్యలను పరిష్కరించే పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది.. గతంలో ఎప్పుడు లేని విధంగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.. మరి ఈ సినిమా ఎటువంటి అవార్డులను అందుకుంటుందో చూడాలి.. ఈ వార్తల్లో నిజమేంతో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు..