NTV Telugu Site icon

Mahesh Kumar Goud: రేవంత్ రెడ్డి వ్యాఖ్యాల్లో తప్పులేదు.. సీతక్క సీఎం ఐతే తప్పేంటి..?

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud: రేవంత్ రెడ్డి వ్యాఖ్యాల్లో తప్పులేదని, సీతక్క సీఎం ఐతే తప్పేంటని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ ప్రవేశ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యాల్లో తప్పులేదని అన్నారు. రేవంత్ వ్యాఖ్యలను పూర్తిగా వినకుండా కేటీఆర్ దిగజారి రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వద్దని, పూర్తి వీడియో చూసి స్పందిస్తే బాగుండేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఎవరైనా సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్పడం రేవంత్ ఉద్దేశ్యమని అన్నారు. సీతక్క సీఎం ఐతే తప్పేముంది ప్రశ్నించారు. కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించే ఆనవాయితీ లేదన్నారు.

Read also: Sniffer Dogs: పోలీసు కుక్కలకు ఫేర్ వెల్ పార్టీ.. దండేసి ఘన సన్మానం

రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. రేవంత్ ఏ సందర్భంలో అలా అన్నారో తనకు తెలియదన్నారు. ఉచిత కరెంటు ఇవ్వవద్దని రేవంత్ చెబితే తప్పేనన్నారు. దేశంలోనే తొలిసారిగా ఉచిత విద్యుత్‌ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించిందన్నారు. ఈ విషయంలో సోనియాను వైఎస్ఆర్ ఒప్పించారు. అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో లేరని అన్నారు. అప్పుడు ఎంత కష్టపడ్డాడో అతనికి తెలియదు. బీఆర్‌ఎస్ ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని కోరారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రేవంత్, తానైన ఇద్దరూ పార్టీ సమన్వయకర్తలేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో ఇలా చేస్తామని చెప్పే అధికారం తమకు లేదన్నారు.

Read also: Komatireddy Venkat Reddy: రేవంత్ ఉచిత కరెంట్ వద్దంటే తప్పే.. సీతక్క సీఎం అనేది పెద్ద జోక్

రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తామని.. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానంతో చర్చించి మేనిఫెస్టోలో పెడతామన్నారు. కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా తాను ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని.. విరామం లేకుండా నాణ్యమైన కరెంటు ఇస్తామని చెప్పారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా సీఎం కాగలరనేది జోక్ అన్నారు. ఆలు లేదు..చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉందని కొట్టిపడేశారు. 65 సీట్లు ఎలా గెలవాలి చూసుకో? ఉచిత కరెంట్ మీ పరిధిలో అంశం కాదు అని చురకలు అంటించారు. రేవంత్ వ్యాఖ్యలపై రేవంత్ వచ్చాకా..కూర్చొని మాట్లాడతామన్నారు. ఏఐసీసీతో ఎన్నికల మేనిఫెస్టో లో ఉచిత కరెంట్ హామీ ఇస్తామని క్లారిటీ ఇచ్చారు.
TS Current Issue: రాష్ట్రంలో కరెంట్ కహానీ.. అటు బీఆర్ఎస్ నిప్పులు.. ఇటు కాంగ్రెస్ తిప్పలు