NTV Telugu Site icon

Mahesh : రాజమౌళి సినిమా కోసం భారీగా ఛార్జ్ చేస్తున్న మహేష్..!!

Image 1663072826

Image 1663072826

రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా తో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు పాన్ ఇండియా హీరోలుగా మారారు.ఆ స్థాయి లో ఇప్పుడు మహేష్ బాబు కూడా క్రేజ్ ను దక్కించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల యొక్క ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా మహేష్ బాబు తో రూపొందించబోతున్న సినిమా ఉంటుంది అంటూ అభిమానులు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు.

రాజమౌళి ప్రతి సినిమాకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూనే ఉన్నాడు. తాజా గా మరోసారి మహేష్ బాబు సినిమా కోసం అంతకు మించి అన్నట్లుగా టెక్నాలజీని తీసుకు వచ్చి విజువల్ వండర్ గా చూపించేందుకు గాను అంతర్జాతీయ స్థాయి వీఎఫ్ఎక్స్ సంస్థతో ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. రాజమౌళి దర్శకత్వం లో మహేష్ బాబు నటించేందుకు దాదాపుగా రెండు సంవత్సరాల పాటు డేట్లు ఇవ్వడం అయితే జరిగింది.. దాంతో మహేష్ బాబు కు సుమారు వంద కోట్ల పారితోషికం ను నిర్మాతలు ఇవ్వబోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. మరో వైపు మహేష్ బాబు పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటాను అయితే తీసుకోబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి.. వంద కోట్ల పారితోషికంను తన యొక్క వాటాగా పెట్టి సినిమాను నిర్మించబోతున్నారని సమాచారం.మొత్తానికి మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబో సినిమా కి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే మొదలు అయ్యింది. అన్ని అనుకున్నట్లుగా కనుక జరిగితే త్వరలో నే సెట్స్ పై కి వెళ్లే అవకాశాలు కూడా వున్నాయి అంటూ రాజమౌళి సన్నిహితుల నుండి సమాచారం కూడా అందుతోంది.

Show comments