Site icon NTV Telugu

Mahesh Babu : ఏంటి.. మహేష్ బాబుకు ఆ అలవాటు కూడా ఉందా?

Mahesh Babu

Mahesh Babu

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఒకవైపు సినిమాలు, మరోవైపు వాణిజ్య ప్రకటనలు, సొంత బిజినెస్ లతో బాగానే సంపాదిస్తున్నారు.. మహేష్ బాబు గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..

సాధారణంగా మహేష్ పక్కా ఫ్యామిలీ మ్యాన్. షూటింగ్ లేకపోతే ఫ్యామిలీనే ఆయన ప్రపంచం. ప్రతి ఏడాది అనేక మార్లు కుటుంబంతో కలిసి టూర్స్ కి వెళతారు. మహేష్ ఫ్యామిలీ దాదాపు ప్రపంచాన్ని చుట్టేశారు. ఇక ఇంట్లో ఉంటే కొడుకు, కూతురుతో సరదాగా గడుపుతారు.. ఇంకా ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతారు.. ఇవే కాదు ఒక్కోసారి వంట కూడా చేస్తారని ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.. ఇవే కాదు వీడియో గేమ్ ఆడే అలవాటు కూడా ఉందట. తన కూతురు కొడుకుతో కలిసి గంటల తరబడి వీడియో గేమ్ లను ఆడుతాడట..

ఇది నమ్రతకు అసలు నచ్చదట. ఆ వీడియో గేమ్స్ పిచ్చి తగ్గించాలని నమ్రత చాలా ట్రై చేశారట. అయినా మహేష్ మానుకోవడం లేదట..మహేష్ కి గతంలో ధూమపానం అలవాటు కూడా ఉండేదట. విపరీతంగా స్మోకింగ్ చేసేవాడిని. ఆ వ్యసనం నుండి బయటపడ్డానని ఓ సందర్భంలో మహేష్ బాబు స్వయంగా తెలియజేశాడు. మొబైల్ సైతం మహేష్ కి ఒక వ్యసనం అట. నిద్రలేవగానే ఫోన్ చూస్తారట. ఈ విషయాన్ని కూడా ఆయన స్వయంగా చెప్పారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గుంటూరు కారం చేస్తున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరు కారం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.. ఆ తర్వాత రాజమౌళితో ఓ సినిమా చెయ్యనున్నాడు..

Exit mobile version