Site icon NTV Telugu

Mahesh Babu Next Film: ఇండస్ట్రీల రికార్డ్‌లు తిరగరాసే కాంబో ఫిక్స్.. యానిమల్‌కు మించింది రాబోతున్నట్లు హింట్!

Mahesh Babu Sandeep Reddy V

Mahesh Babu Sandeep Reddy V

Mahesh Babu Next Film: టాలీవుడు సూపర్ స్టార్ మహేష్ బాబు లైన్ అప్ మామూలుగా లేదని టాక్. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో SSMB29 అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా బడ్జెట్ సుమారుగా ₹1,000 కోట్లు అని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నట్లు వినికిడి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఈ సినిమా 2027లో విడుదల కానుందని టాక్ నడుస్తుంది. ఆర్ఆర్ఆర్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

READ ALSO: Tariff On India: అమెరికాకు తత్వం బోధపడింది.. భారత్‌పై 25% టారిఫ్ తగ్గించే ఛాన్స్..

మహేష్ బాబుతో నెక్ట్స్ ఎవరు..
SSMB29 లాంటి భారీ చిత్రం తర్వాత మహేష్ బాబు నెక్ట్స్ ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. మహేష్ బాబు 2026 లో కూడా రాజమౌళి సినిమాతో బిజీగా ఉండనున్నారు. అయితే ఇప్పటి నుంచే ఈ హీరో నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై జోరుగా చర్చ నడుస్తుంది. బాబుతో సినిమా చేయడానికి ఇప్పటికే చాలా మంది నిర్మాతలు వరుసలో ఉన్నట్లు సమాచారం. మహేష్ బాబును ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు సంప్రదించినట్లు టాలీవుడ్ సర్కిల్‌లో టాక్ నడుస్తుంది. అలాగే నిర్మాత ఏసియన్ సునీల్ కూడా మహేష్ బాబును కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏసియన్ సునీల్ నిర్మాణంలో రానున్న భారీ చిత్రానికి యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించబోతున్నట్లు టాక్.

అర్జున్ రెడ్డి టైంలో అడ్వాన్స్ తీసుకున్నట్లు టాక్..
పలు కథనాల ప్రకారం.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. అర్జున్ రెడ్డి విడుదల టైంలో ఏసియన్ సునీల్ నుంచి అడ్వాన్స్ తీసుకున్నట్లు టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు కోసం ఒక ఐడియా సిద్ధంగా చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ ఐడియాను ఏసియన్ సునీల్ మహేష్ బాబుకు వినిపించారని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా విషయంలో మహేష్ బాబు తన నిర్ణయాన్ని చెప్పడానికి కొంచెం టైం పట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సినిమా ఒకే షెడ్యూల్‌లో పూర్తవుతుందని టాక్ నడుస్తుంది. ఆ తర్వాత సందీప్ రణబీర్ కపూర్‌తో యానిమల్ పార్క్‌లో కంప్లీట్ చేస్తాడని టాక్ నడుస్తుంది.

ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్‌లో వరుస విజయాలతో సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమా రణబీర్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. యానిమల్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ₹900 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ఒకవేళ సందీప్ డైరెక్షన్‌లో మహేష్ బాబు సినిమా ఫిక్స్ అయితే మామూలు కాంబో కాదని సినీ అభిమానులు చెబుతున్నారు.

READ ALSO: Trump Statue: ఇదేందయ్యా ఇది.. బతికి ఉండగానే అమెరికా అధ్యక్షుడికి బంగారు విగ్రహం!

Exit mobile version