హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో యాక్షన్, కామెడీ జానర్లో రాబిన్‌హుడ్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. నితిన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ క్రేజీ హై-బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా అడ్వెంచర్ అండ్ హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్‌ను రిలీజ్ చేయడంతో మేకర్స్ రియల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. టీజర్ పవర్ ఫుల్ వాయిస్‌ఓవర్‌తో స్టార్ట్ అయింది. నితిన్ హై-ఫై ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, అడ్వెంచరస్ దోపిడీలను చేసే మోడరన్ రాబిన్‌హుడ్‌గా పరిచయం అయ్యారు.
READ MORE: Shambhala: నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల’.. భయపెట్టిస్తున్న అర్చన అయ్యర్ ఫస్ట్ లుక్..
ఇదిలా ఉండగా.. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాలోని సాంగ్ లిరికల్ వీడియోను మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. సినిమా యూనిట్‌కి మహేశ్ శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణకాంత్ రాసిన ఈ పాటని అర్మాన్ మాలిక్ పాడారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించారు. ‘వేరెవర్ యూ గో’ అంటూ సాంగ్ లిరికల్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా.. ‘రాబిన్‌హుడ్’ సినిమా మార్చి 28న బాక్సాఫీసు వద్ద ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా రాక కోసం నితిన్ ఫ్యాన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
READ MORE: Oh Bhama Ayyo Rama: వాలెంటైన్స్ డే స్పెషల్.. ‘ఓ భామ అయ్యో రామ’ పోస్టర్ విడుదల..