Site icon NTV Telugu

Mahavatar Narsimha: భారత్లో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా మహావతార్ నరసింహ!

Mahavatar Narsimha

Mahavatar Narsimha

Mahavatar Narsimha: కన్నడ సినీ పరిశ్రమకు చెందిన హోంబాలే ఫిలింస్ పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము లేపుతోంది. KGF, సలార్, కాంతర వంటి భారీ ప్రాజెక్ట్స్ విజయవంతం అయిన తరువాత, ఇప్పుడు అదే స్థాయిలో ఓ గ్రాండ్ యూనివర్స్‌కు బీజం వేసింది. అదే మాహావతార్ సినమాటిక్ యూనివర్స్ (MCU). క్లీమ్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో రూపొందిన ఈ యూనివర్స్‌లో తొలి చిత్రం మాహావతార్ నర్సింహా ఇప్పటికే భారతీయ యానిమేషన్ చరిత్రలో రికార్డ్స్ సృష్టిస్తోంది.

ఈ యానిమేటెడ్ మైతాలజికల్ సిరీస్ విష్ణుమూర్తి దశావతారాల ఆధారంగా రూపొందించబడింది. దర్శకుడు అశ్విన్ కుమార్ రూపొందించిన ఈ సినిమా, హరిహర వీరమల్లు, సయ్యారా వంటి బడా సినిమాలతో పోటీపడుతూ విడుదలైనప్పటికీ, ప్రేక్షకుల మనసు గెలుచుకొని భారీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేషన్ చిత్రంగా మహావతార్ నరసింహ రికార్డ్ సృష్టించింది. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌ స్పైడర్ మ్యాన్ ను అధిగమించి ఈ ఘనత సాధించడం భారత యానిమేషన్ రంగానికి గర్వకారణం. ఇప్పటివరకు ఈ చిత్రం భారతదేశంలో రూ. 60.5 కోట్లు గ్రాస్ చేసింది.

Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రాకు విడుదల.. మళ్లీ ఆడేది ఎప్పుడో!

ఇందులో హిందీ వెర్షన్ రూ. 38 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి బాక్సాఫీస్ వద్ద రఫ్ఫాడిస్తోంది. మిగితా భాషల వెర్షన్లలోనూ మంచి కలెక్షన్లను రాబడుతోంది. ప్రేక్షకులు కుటుంబంతో కలిసి థియేటర్లకు రావడం, చిన్నారులు ప్రత్యేకంగా ఆస్వాదించడం లాంటి అంశాలు ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. ఈ మాహావతార్ నర్సింహా విజయంతో హోంబాలే ఫిలింస్ MCU ప్రాజెక్టుపై మరింత నమ్మకంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే యూనివర్స్‌కు సంబంధించిన తదుపరి చిత్రాల షెడ్యూల్ ను కూడా ప్రకటించింది.

ఈ షెడ్యూల్ లో 2027లో మాహావతార్ పారశురామ్, 2029లో మాహావతార్ రఘునందన్, 2031లో మాహావతార్ ద్వారకాధీష్, 2033లో మాహావతార్ గోకులానంద, 2035లో హావతార్ కల్కి పార్ట్ 1, 2037లో మాహావతార్ కల్కి పార్ట్ 2 తెరపైకి రానున్నాయి. ఈ విజయంతో భారత యానిమేషన్ రంగానికి కొత్త ప్రేరణ లభించింది. అంతర్జాతీయ మార్కెట్లను లక్ష్యంగా చేసుకున్న కంటెంట్ ఇప్పుడు మన దేశంలోనూ స్వేచ్ఛగా వినియోగదారులకు చేరుతోంది.

Vivo T4R vs Samsung Galaxy F36: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు.. వివో T4R vs శాంసంగ్ గెలాక్సీ F36.. ఏది బెస్ట్?

Exit mobile version