NTV Telugu Site icon

Mahashivratri 2024: శివరాత్రి నాడు ఈ అభిషేకాలు చేస్తే.. ఆ సమస్యలు దూరం..

Siva Sbhishekam

Siva Sbhishekam

మహాశివరాత్రి పండుగను ఈ ఏడాది మార్చి 8న జరుపుకుంటున్నారు.. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని పెద్దలు చెబుతుంటారు.. ఆరోజున శివుడి అనుగ్రహం కలగాలని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు.. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున శివరాత్రి వస్తుంది. ఈ రోజున పరమశివుడు పార్వతిల కల్యాణం జరిగింది. ఈ రోజున ప్రజలు ఉపవాసం ఉండి శివుడిని భక్తితో పూజిస్తారు.. ఈరోజున ప్రత్యేక అభిషేకాలు చేస్తే శివుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.. ఆ అభిషేకాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం..

గంగాజలంతో అర్ధనాదీశ్వరుడిని అభిషేకం చెయ్యడం వల్ల మంచిది.. ఈ జలంతో అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గ్రంథాల ప్రకారం రుద్రాభిషేకం సమయంలో గంగాజలాన్ని ఉపయోగించడం వల్ల ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఈ పవిత్ర జలంతో స్నానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.. ఈ జలంతో రుద్రాభిషేకం చేస్తే కుటుంబ సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు..

అంతేకాదు జనపనార రసంతో శివుడికి అభిషేకం చెయ్యడం మంచిది.. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆత్మకు శాంతిని అందిస్తుంది.. శివుడి అనుగ్రహం కలుగుతుంది.. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు..

నెయ్యితో మాహా శివుడికి అభిషేకం చెయ్యడం మంచిది.. శివారాధనలో నెయ్యి ఉపయోగించడం చాలా శుభప్రదంగా చెబుతారు.. కుటుంబంలో సుఖ, సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు..

అంతేకాదు చక్కెర నీటితో రుద్రాభిషేకం చేస్తే ఆధ్యాత్మిక, భౌతిక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది.. అలాగే ఆవనూనె తో అభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.. పాలతో, తేనెతో కూడా అభిషేకం చేస్తారు.. శివరాత్రి రోజున శివ నామ స్మరణ చేస్తూ పూజలు చెయ్యడం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుంది..