NTV Telugu Site icon

Stray Dogs: అసోంలో కుక్కలకు మంచి డిమాండ్.. రేటు తెలిస్తే షాక్ అవుతారు

Vacchu

Vacchu

Stray Dogs: అసోంలో కుక్కలకు మంచి డిమాండ్ ఉందంటూ మహారాష్ట్ర ఎమ్మెల్యే బచ్చు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వీధి కుక్కలను అసోం రాష్ట్రానికి పంపాలని అన్నారు. వీధి కుక్కల బెడద తీరడానికి ఇచ్చిన సూచన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అక్కడ రాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తాను ఇటీవలే అసోం పర్యటించానని.. కుక్కలకు మంచి డిమాండ్ ఉందన్నారు. అక్కడి వారు కుక్కలను ఆహారంగా తీసుకుంటారని తనకు తెలిసిందన్నారు. అక్కడ ఒక్క కుక్కకు సుమారు రూ. 8 వేల వరకు పలుకుతున్నదని చెప్పారు.

Read Also: Viral: సాయం చిన్నదైన ఆదర్శం గొప్పది.. ఆచరించాలంటే మనసుండాలి

అసోం నుంచి వ్యాపారులను మహారాష్ట్రకు రప్పించాలని, వారితో డీల్ మాట్లాడుకుని ఇక్కడి వీధి కుక్కలను అసోంకి పంపించాలని అన్నారు. అక్కడ ఆ కుక్కలను వదశాలలకు తరలించి మాంసం కోసం వదించి మార్కెట్‌లలో అమ్ముతారని తెలిపారు. ఆయన వ్యాఖ్యలపై జంతు ప్రేమికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు అమానుషంగా ఉన్నాయంటున్నారు. ఇలా కుక్కల గురించి ఇలా అనుమానుషంగా మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. జార్ఖండ్‌ బీజేపీ ఎమ్మెల్యే బిరాంచి నారాయణ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

Read Also: Delhi Court: మోదీని చంపుతాడని సాక్ష్యం ఉందా.. లేదు కదా.. అందుకే నిర్దోషి