NTV Telugu Site icon

Maharaja OTT : ‘మహారాజ’ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది..?

Maharajaaaaaa

Maharajaaaaaa

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు ఆయన పేరు పరిచయమే.. ‘మాస్టర్’ ‘ఉప్పెన’ ‘విక్రమ్’ వంటి సినిమాలతో విజయ్ సేతుపతికు తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.. తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. రీసెంట్ గా మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది..

తాజాగా ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ వచ్చేసాయి.. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. రిలీజైన నెల రోజుల్లో ఈ సినిమా ఓటిటిలో వస్తుందని చెప్తున్నారు. అయితే ఈ సినిమా ఇంకా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతే మాత్రం ఇంకా కొన్ని రోజులు తర్వాత ఓటీటీలోకి రాబోతుంది.. ఈ విషయం పై త్వరలోనే ఓటీటీ ప్రకటన రాబోతుందని సమాచారం..

ఇకపోతే నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ‘ప్యాషన్ స్టూడియోస్’, ‘ది రూట్’ సంస్థలపై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి లు కలిసి నిర్మించారు. అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించడం విశేషం.. విజయ్ సేతుపతి ఖాతాలో మరో హిట్ మూవీ పడింది.. మరోవైపు కలెక్షన్స్ కూడా భారీగానే వసూల్ చేస్తుంది..