Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థిగా మాగంటి సునీత అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఆమె తన నామపత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్ దేదీప్యతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
BC Leaders Fight: బీసీ సంఘాల ప్రతినిధులు మధ్య తోపులాట.. చెయ్యి చేసుకున్న నేతలు
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఈ ఏడాది జూన్ 8న అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన మరణంతో ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నిక అవసరమైంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ.. ఆయన సతీమణి మాగంటి సునీతకు బీఫామ్ జారీ చేసి అభ్యర్థిగా నిలబెట్టింది. ఇక ఈ ఉపఎన్నికకు సంబంధించి నవంబర్ 11న పోలింగ్, ఆ తర్వాత 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. మాగంటి సునీత నామినేషన్‌తో జూబ్లీహిల్స్ రాజకీయ వాతావరణం మరింత వేడక్కనుంది.
Kavitha: ప్రజలే నా గురువులు.. కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేస్తాను..!
