Site icon NTV Telugu

Madhurima : బికినీ అందాలతో రెచ్చిపోయిన మధురిమ…

Whatsapp Image 2023 06 22 At 10.19.31 Am

Whatsapp Image 2023 06 22 At 10.19.31 Am

హీరోయిన్ మధురిమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈ అందాల ముద్దుగుమ్మ ఆ ఒక్కడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది.ఆ తర్వాత వంశీ సరదాగా కాసేపు సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ.. ఈ అమ్మడు అసలు పేరు  నైరాబెనర్జీ…బెంగాలీ ప్రాంతానికి చెందిన మధురిమ బెనర్జీ అనే పేరుతో తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా కొన్ని సినిమాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ గా ఛాన్సులు రావడం కష్టం అయింది. హీరోయిన్ ఛాన్స్ లు రాకపోవడంతో తెలుగులో మారుతీ సినిమా అయిన కొత్త జంటలో ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే నాగ చైతన్య నటించిన దోచేయ్ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది.టెంపర్ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది మధురిమ. ఆ తర్వాత బాలీవుడ్లో అవకాశాలు ఎక్కువగా రావడంతో ఆమె ఫోకస్ అంతా అక్కడే పెట్టి పలు క్రేజీ చిత్రాలలో నటిస్తోంది.

బాలీవుడ్ లో వన్ నైట్ స్టాండ్ మూవీ తో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత ఆజార్ మూవీలో ముఖ్యమైన పాత్రలో నటించింది.. ఆ తర్వాత కన్నడలో టైగర్ అనే సినిమాలో కూడా నటించింది ఇక ఆమెకు హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరకు షిఫ్ట్ అయింది మధురిమ.. ప్రస్తుతం  పిశాచిని అనే సీరియల్ లో ప్రధాన పాత్రలో నటిస్తోంది.బాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత తనలోని హాట్ గ్లామర్ తో అందరినీ బాగా ఆకట్టుకుంటోంది.ఇంస్టాగ్రామ్ లో హాట్ యాంగిల్ తో పలు రకాల ఫోటోలను షేర్ చేసింది . బికినీలోని హాట్ హాట్ అందాలతో అదరగొట్టింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. స్విమ్మింగ్ పూల్ పక్కనే రెడ్ కలర్ బికినీలో మధురిమ షేర్ చేసిన ఈ ఫోటోలు కుర్రాళ్లకు అందాల కనువిందు చేస్తున్నాయి.ఆ ఫోటోలపై నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు..

Exit mobile version