Site icon NTV Telugu

Commonwealth Youth Games- 2023: కామన్వెల్త్ యూత్ గేమ్స్ ప్రారంభ వేడుకల్లో మాధవన్ కుమారుడు

Madhavan

Madhavan

కామన్వెల్త్ యూత్ గేమ్స్-2023 గేమ్స్ ప్రారంభమయ్యాయి. ట్రినిడాడ్ మరియు టొబాగా వేదికగా ఈ గేమ్స్ జరుగుతున్నాయి. ఆగష్టు 4న ప్రారంభమైన కామన్వెల్త్ యూత్ గేమ్స్.. ఈనెల 11 వరకు కొనసాగనున్నాయి. ఈ గేమ్స్ లో భారత్ కూడా పాల్గొంటుండగా.. సత్తా చాటాలని చూస్తుంది. అంతేకాకుండా రికార్డు స్థాయిలో పతకాలు సాధించాలని ధృడనిశ్చయంతో ఉంది.

SIIMA 2023: బెస్ట్ యాక్టర్ అవార్డు బరిలో చరణ్, ఎన్టీఆర్.. ఎవరికిచ్చినా రచ్చ తప్పదుగా!

మరోవైపు కామన్వెల్త్ యూత్ గేమ్స్ వేడుకల్లో సినీ నటుడు ఆర్.మాధవన్ కుమారుడు వేదాంత్ మెరిశాడు. ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న వేదాంత్.. ఇండియాకు సపోర్ట్ చేస్తూ భారతదేశ పతకాన్ని పట్టుకుని గ్రౌండ్ చుట్టూ తిరిగాడు. అయితే ఆ వేడుకల్లో పాల్గొన్న వేదాంత్ వీడియోను.. తన తండ్రి ఆర్.మాధవన్ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఆ వీడియోను చూసిన పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

SIIMA 2023: బెస్ట్ యాక్టర్ అవార్డు బరిలో చరణ్, ఎన్టీఆర్.. ఎవరికిచ్చినా రచ్చ తప్పదుగా! 

అయితే ఇంతకుముందు ఆర్ మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ ఖేలో ఇండియా గేమ్స్ లో పాల్గొన్నాడు. అతను స్విమ్మింగ్‌లో పతకాల పంట పండించాడు. ఐదు స్వర్ణాలు, రెండు రజత పతకాలు సాధించాడు.

Exit mobile version