టాలీవుడ్‌లో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘మ్యాడ్’. ఆ తర్వాత వచ్చిన ‘మ్యాడ్ 2’ కూడా అదే స్థాయిలో యూత్‌ను ఆకట్టుకుని, కాసుల వర్షం కురిపించింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ మార్క్ కామెడీ, నార్నె నవీన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్‌ల పర్‌ఫార్మెన్స్‌తో ఈ సిరీస్ ఒక బ్రాండ్‌గా మారిపోయింది. తాజాగా, ఈ ఫ్రాంచైజీ నుండి రాబోతున్న ‘మ్యాడ్ 3’ (Mad 3) గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.
Also Read : Ram Charan- Upasana: మెగా జంట రామ్ చరణ్, ఉపాసనకు.. బన్నీ ఎమోషనల్ విషెస్
ఈసారి ‘మ్యాడ్ 3’లో పాత గ్యాంగ్‌కు బదులుగా కొత్త కాస్టింగ్‌ను పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న జేయ్ కృష్ణ, ‘కోర్ట్’ ఫేం హర్ష్ రోషన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారట. ఈ కొత్త కాంబినేషన్ యూత్‌కు సరికొత్త వినోదాన్ని పంచుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ చిత్రానికి ‘మ్యాడ్ జూనియర్స్’ (Mad Juniors) అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా మొదలైందని, త్వరలోనే అధికారికంగా కొత్త కాస్టింగ్ వివరాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మ్యాడ్ సిరీస్‌లో ఉండే ఆ క్రేజీ కామెడీ ఈ ‘జూనియర్స్’ తో కూడా రిపీట్ అవుతుందో లేదో చూడాలి!
