Site icon NTV Telugu

Kollu Ravindra: మచిలీపట్నం పోర్టుపై మంత్రి కీలక అప్డెట్.. ఎప్పటిలోగా పూర్తవుతుందంటే..?

Kollu Ravindra

Kollu Ravindra

Kollu Ravindra: మచిలీపట్నం పోర్టుపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక అప్డెట్ ఇచ్చారు. మచిలీపట్నం పోర్టు ఒక సంవత్సరంలో పూర్తి అవుతుందని తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పోర్టు కనెక్టివిటీ కోసం రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉందని మంత్రి చెప్పారు. దాదాపు 400 కోట్లతో పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నామన్నారు. పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు ఎక్కడ ప్లే ఓవర్, అండర్ పాస్ లు ఉండాలని అధికారులు ప్రణాళికలు వేస్తున్నారని చెప్పారు. మచిలీపట్నం, విజయవాడ జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.. ఇందుకోసం 2 వేల కోట్లు ఖర్చు అవుతాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదన చేశామని.. విజయవాడ నుంచి గోసాల వరకు రోడ్డు విస్తరణ చేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు. పెడన, గుడివాడ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో హైవేకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చెప్పారని తెలిపారు.

READ MORE: CNAP Service: ఇంటర్నెట్ అవసరం లేదు.. యాప్‌తో పని లేదు.. ఫోన్ స్క్రీన్‌పై డైరెక్ట్‌గా కాలర్ పేరు

కత్తిపూడి, ఒంగోలు జాతీయ రహదారి 350 కిలో మీటర్లు ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. “ఈ రహదారికి తీర ప్రాంత గ్రామాలు తాళ్ళపాలెం, గిలకలదింది, కోడూరు ప్రాంతాలను కలపాలని ఎమ్మెల్యేలు చెప్పారు.. తీర ప్రాంతాలను కలుపుతూ హైవే నిర్మాణం చేస్తే ఆయా గ్రామాలు కూడా అభివృద్ధి జరుగుతుంది.. పామర్రు నుంచి చల్లపల్లి వరకు ఉన్న రహదారిని పీఎం గతి శక్తి ద్వారా అభివృద్ధి చేస్తాం.. 4 లైన్ల నుంచి 6 లైన్ల రహదారులకు అభివృద్ధి చేసే క్రమంలో ఇప్పుడు ఉన్న సమస్యలు పరిష్కారం చేసేలా డిపిఆర్ లో పెట్టాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు.. కంకిపాడు నుంచి గుడివాడ వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన చేశాం.. ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయి అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి.” అని మంత్రి స్పష్ట చేశారు.

READ MORE: SLBC Tunnel: నిపుణుల కమిటీకి SLBC హెలిమాగ్నెట్ రిపోర్ట్

Exit mobile version