Site icon NTV Telugu

Maayon : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన అడ్వెంచర్‌ థ్రిల్లర్‌..

Whatsapp Image 2023 09 14 At 10.09.51 Am

Whatsapp Image 2023 09 14 At 10.09.51 Am

థియేటర్లలో విడుదల అయిన ప్రతి సినిమా దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంటాయి.ఒక్కోసారి అనుకున్న ఒప్పందం కంటే ముందు గానే  ఓటీటీ లోకి అడుగుపెడతాయి..అలాగే కొన్ని సినిమాలు మరింత ఆలస్యంగా కూడా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి. ప్రతి సినిమాకు ఆయా దర్శక నిర్మాతలు, ఓటీటీ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే ఇదంతా జరుగుతుంది. అయితే ఇటీవల థియేటర్లలో రిలీజైన కొన్ని సినిమాలు ఓటీటీల్లోకి రావడం లేదు. అఖిల్‌ ఏజెంట్‌, ది కేరళ స్టోరీ లు థియేటర్లలో రిలీజై నెలలు గడిచాయి.అయితే ఇంతవరకు డిజిటల్‌ స్ట్రీమింగ్ కు ఆ సినిమాలు రాలేదు. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడెన్‌గా కొన్ని సినిమాలు ఓటీటీలోకి దర్శనమిస్తుంటాయి. అలా గతేడాది థియేటర్లలో రిలీజైన ఒక మైథలాజికల్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. బాహుబలి సినిమాలో కట్టప్పగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సత్యరాజ్‌. ఇప్పుడు ఆయన తనయుడు సిబి సత్యరాజ్‌ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వరుసగా సినిమాలు కూడా చేస్తున్నాడు. అలా సిబిరాజ్‌ నటించిన మయోన్‌. ఎన్. కిషోర్ తెరకెక్కించిన ఈ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌లో తాన్యా రవిచంద్రన్‌ హీరోయిన్‌గా నటించింది.

గత సంవత్సరం జులై 7న థియేటర్లలో విడుదల అయిన మాయోన్‌ భారీ సక్సెస్ కాకపోయిన మంచి టాక్ తెచ్చుకుంది.ఆసక్తికరమైన కథా, కథనాలు, విజవల్స్, అడ్వెంచర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లు కూడా అంతంత మాత్రమే వచ్చాయి.అయితే థియేటర్లలో విడుదల అయిన దాదాపు ఏడాదికి మాయోన్‌ ఓటీటీ లో రిలీజ్‌ అయింది ఈ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. నెల రోజులక్రితం తమిళంలో స్ట్రీమింగ్ అయిన మాయోన్ తాజాగా తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్ బ్యానర్‍పై మామిడాల శ్రీనివాస్, అరుణ్ మోజి మాణిక్యం మాయోన్‌ను నిర్మించారు.ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులని ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి

Exit mobile version