టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు నటించిన లేటెస్ట్ మూవీ మామా మశ్చీంద్ర ఓటీటీ రిలీజ్ డేట్ ను అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. అక్టోబర్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.థియేటర్ రిలీజ్ కు అలాగే ఓటీటీ స్ట్రీమింగ్ కు మధ్య కనీసం రెండు వారాలు కూడా గ్యాప్ లేకపోవడం ఆసక్తికరం గా మారింది.అక్టోబర్ 6 న చిన్న సినిమాల భారీ పోటీ మధ్య రిలీజైన మామా మశ్చీంద్ర నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.ప్రయోగాత్మక కథాంశం తో రూపొందిన ఈ సినిమాలో సుధీర్‌బాబు త్రిబుల్ రోల్ లో నటించి మెప్పించాడు..అతడి నటన కు ప్రశంసలు దక్కినా కూడా కథలో కన్ఫ్యూజన్ ఎక్కువ కావడం, సరైన ప్రమోషన్స్ లేకపోవడం తో కనీసం మూడు రోజులు కూడా ఈ సినిమా థియేటర్ల లో నిలబడలేకపోయింది. మామా మశ్చీంద్ర సినిమా కు నటుడు హర్షవర్ధన్ దర్శకత్వం వహించాడు. ఈషారెబ్బా, మృణాళిని హీరోయిన్లు గా నటించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే..ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు భిన్నమైన వ్యక్తుల కథతో మామా మశ్చీంద్ర సినిమా ను రూపొందించారు హర్షవర్ధన్. ఆస్తి కోసం పరశురామ్ (సుధీర్‌బాబు) అసిస్టెంట్ దాసు(హర్షవర్ధన్) సహాయంతో తన సొంత చెల్లెలిని చంపాలని అయితే అనుకుంటాడు. కానీ అతడి ప్లాన్ అనుకున్నట్లు సాగదు..చాలా సంవత్సరాల తర్వాత వైజాగ్‌కు చెందిన దుర్గ (సుధీర్ బాబు) అనే రౌడీ, హైదరాబాద్‌కు చెందిన డీజే (సుధీర్ బాబు)….పరశురామ్ పోలికల తోనే అతడికి కనిపిస్తారు.. పరశురామ్ తో వారిద్దరికి ఉన్న సంబంధం ఏమిటి…పరశురామ్ కూతురు విశాలక్ష్మి (ఈషారెబ్బా), దాసు కూతురు మీనాక్షి (మృణాళిని) దుర్గ, డీజేలలో ఎవరిని ప్రేమించారు.. పరశురామ్ పై డీజే, దుర్గ ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు అన్నదే ఈ సినిమా కథ.సుధీర్ బాబు కు వరుస పరాజయాలు తప్పట్లేదు. అయినా కూడా ఈ హీరో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.
