Site icon NTV Telugu

Maa Oori Polimera 2 : అరుదైన ఘనత సాధించిన “పొలిమేర 2”..

Whatsapp Image 2024 04 29 At 12.51.26 Pm

Whatsapp Image 2024 04 29 At 12.51.26 Pm

స్టార్ కమెడియన్ సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన “మా ఊరి పొలిమేర “ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2021 లో వచ్చిన “మా ఊరి పొలిమేర “సినిమా నేరుగా ఓటిటిలో విడుదల అయి అద్భుత విజయం సాధించింది.చేతబడి ,మర్డర్ మిస్టరీల చుట్టూ తిరిగే ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది .ఈ సినిమాలో సత్యం రాజేష్ ,కామాక్షి భాస్కర్ల ,గెటప్ శీను ,బాలాదిత్య ,రవి వర్మ ,రాకేందు మౌళి కీలక  పాత్రలు పోషించారు. పొలిమేర సినిమా మంచి విజయం సాధించడంతో దర్శకుడు అనిల్ విశ్వనాధ్ ఈ సినిమాకు సీక్వెల్ గా “పొలిమేర 2 ” సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌర్ కృష్ణ నిర్మించారు. ఈ చిత్రానికి గ్యాని మ్యూజిక్ అందించారు.

పొలిమేర సినిమాలో నటించిన ప్రధాన పాత్రలు ఈ సినిమాలో కూడా కనిపిస్తాయి.పొలిమేర 2 చిత్రం కూడా చేతబడి,క్షుద్ర పూజల చుట్టూ తిరుగుతుంది.ఈ సినిమాలో వచ్చే ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.పొలిమేర2 చిత్రం గత ఏడాది నవంబర్ 3 వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది .ఈ సినిమాకు కలెక్షన్స్ భారీగా వచ్చాయి .థియేటర్ లో ఆకట్టుకున్న పొలిమేర 2 మూవీ ఓటిటిలో కూడా అదరగొట్టింది.గత ఏడాది డిసెంబర్ 8 వ తేదీన ఆహా ఓటిటిలో విడుదల అయి అక్కడ కూడా అద్భుత విజయం సాధించింది.ఇదిలా ఉంటే ఈ మూవీ మరో అరుదైన ఘనత సాధించింది .ఏప్రిల్ 30 ,2024 న న్యూ ఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన 14 వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024 లో ఈ చిత్రం అధికారికంగా ఎంపిక చేయబడింది.

Exit mobile version